Vishwambhara: విశ్వంభర మూవీలో మెగా యంగ్ హీరో క్యామియో రోల్.. షూటింగ్ అప్‍డేట్ ఇదే.. చిరంజీవి కొత్త పోస్టర్ రివీల్-sai durgha tej cameo role in vishwambhara and chiranjeevi new poster reveal and shooting update ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara: విశ్వంభర మూవీలో మెగా యంగ్ హీరో క్యామియో రోల్.. షూటింగ్ అప్‍డేట్ ఇదే.. చిరంజీవి కొత్త పోస్టర్ రివీల్

Vishwambhara: విశ్వంభర మూవీలో మెగా యంగ్ హీరో క్యామియో రోల్.. షూటింగ్ అప్‍డేట్ ఇదే.. చిరంజీవి కొత్త పోస్టర్ రివీల్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 15, 2025 07:58 PM IST

Vishwambhara: విశ్వంభర సినిమా షూటింగ్ అప్‍డేట్ బయటికి వచ్చింది. చిరంజీవి కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో ఓ మెగా యంగ్ హీరో క్యామియో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Vishwambhara: విశ్వంభర మూవీలో మెగా యంగ్ హీరో క్యామియో రోల్.. షూటింగ్ అప్‍డేట ఇదే.. చిరంజీవి కొత్త పోస్టర్ రివీల్
Vishwambhara: విశ్వంభర మూవీలో మెగా యంగ్ హీరో క్యామియో రోల్.. షూటింగ్ అప్‍డేట ఇదే.. చిరంజీవి కొత్త పోస్టర్ రివీల్

విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీపై ముందు నుంచి మంచి హైప్ నెలకొంది. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికే రిలీజ్ చేస్తామని గతంలో ప్రటించిన మేకర్స్ వాయిదా వేశారు. తాజాగా విశ్వంభర సినిమా గురించి అప్‍డేట్స్ వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

మాస్ సాంగ్ షూటింగ్

విశ్వంభర సినిమా కోసం ప్రస్తుతం చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‍లో భారీ సెట్‍లో ఈ చిత్రీకరణ సాగుతోంది. ఈ పాటలో చిరంజీవి మాస్ స్టెప్స్ ఉంటాయని తెలుస్తోంది. మాస్ బీట్‍తో ఈ సాంగ్ ఉండనుందట. ఈ మూవీ షూటింగ్ త్వరలో పూర్తవుతుందని తెలుస్తోంది.

చిరంజీవి కొత్త పోస్టర్

విశ్వంభర సినిమా నుంచి చిరంజీవి కొత్త లుక్ నేడు (ఫిబ్రవరి 15) రివీల్ అయింది. గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‍గా జీప్ వద్ద చిరూ నిలబడిన పోస్టర్ వచ్చింది. మాసీగా చిరంజీవి లుక్ అదిరిపోయింది.

మెగా సుప్రీం హీరో క్యామియో

విశ్వంభర చిత్రంలో మెగా సుప్రీం హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్) క్యామియో రోల్‍లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‍లో పాల్గొంటున్నారని సమాచారం. చిరంజీవితో కలిసి నటించాలనేది తన కోరిక అని ఇటీవల తేజ్ అన్నారు. విశ్వంభర మూవీతో అది నెరవేరుతోంది. ఇప్పటికే మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో బ్రో మూవీలో కలిసి అతడు నటించారు. ఇప్పుడు విశ్వంభరలో చిరూతో కలిసి కనిపించనున్నారు.

విశ్వంభర చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ పండుగకు రావటంతో వాయిదా వేసినట్టు రూమర్లు వచ్చాయి. విశ్వంభర ప్లాన్స్ మారిపోయాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత కొత్త విడుదల తేదీని ఖరారు చేసే ఛాన్స్ ఉంది.

విశ్వంభర మూవీని భారీ గ్రాఫిక్స్‌తో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట. మూడు లోకాల మధ్య ఈ చిత్రం స్టోరీ సాగుతుందని సమాచారం. ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందుతోందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. అషికా రంగనాథ్ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం