Hero Srikanth: బ్రిటీష్‌గా హీరో శ్రీకాంత్.. సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి ఫస్ట్ లుక్.. బర్త్ డే స్పెషల్‌గా!-sai durga tej sambarala yeti gattu srikanth first look released on his birthday as british syg heroine aishwarya lekshmi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hero Srikanth: బ్రిటీష్‌గా హీరో శ్రీకాంత్.. సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి ఫస్ట్ లుక్.. బర్త్ డే స్పెషల్‌గా!

Hero Srikanth: బ్రిటీష్‌గా హీరో శ్రీకాంత్.. సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి ఫస్ట్ లుక్.. బర్త్ డే స్పెషల్‌గా!

Sanjiv Kumar HT Telugu

Srikanth First Look From Sambarala Yeti Gattu: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సంబరాల యేటిగట్టు. ఈ మూవీ నుంచి సీనయర్ హీరో శ్రీకాంత్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే స్పెషల్‌గా ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

బ్రిటీష్‌గా హీరో శ్రీకాంత్.. సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి ఫస్ట్ లుక్.. బర్త్ డే స్పెషల్‌గా!

Srikanth First Look From Sambarala Yeti Gattu: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG). ఈ సినిమాతో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు సాయి దుర్గ తేజ్.

భారీ విజయం తర్వాత

సంబరాల యేటిగట్టు సినిమాకు నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో సాయి ధరమ్ తేజ్ నెవెర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ హనుమాన్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంబరాల యేటిగట్టు మూవీని నిర్మిస్తున్నారు.

శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా

సంబరాల యేటిగట్టు సినిమాలో వెర్సటైల్ యాక్టర్, సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆదివారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ శ్రీకాంత్‌ని బ్రిటిషు పాత్రలో పరిచయం చేశారు. దీనికి సంబంధించిన సంబరాల యేటిగట్టు నుంచి శ్రీకాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రగ్గడ్ హెయిర్, గడ్డంతో

సంబరాల యేటిగట్టు సినిమాలోని ఫస్ట్ లుక్‌లో రగ్గడ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ కోట్ ధరించి ఫెరోషియస్‌గా కనిపించిన శ్రీకాంత్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తుంటే ఈ సినిమాలో శ్రీకాంత్‌ది చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్రలా కనిపిస్తోంది. మరోసారి నటనలో తన వైవిధ్యం చూపిస్తారని తెలుస్తోంది.

నెక్ట్స్ లెవెల్‌లో అంచనాలు

ఇదిలా ఉంటే, ఇప్పటికే విడుదలైన సంబరాల యేటిగట్టు కార్నేజ్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై బజ్ పెంచేసింది. దాంతో సినిమాపై నెక్ట్స్ లెవల్‌లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.

సంబరాల యేటిగట్టు టెక్నికల్ టీమ్

ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సంబరాల యేటిగట్టు సినిమా ఇదే సంవత్సరం సెప్టెంబర్ 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి

కాగా, సంబరాల యేటిగట్టు సినిమాలో సాయి దుర్గ తేజ్‌కు జోడీగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి నటించనుంది. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య లక్ష్మి కలిసి జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. మరి ఈ పెయిర్ ఎంత వరకు హిట్ అవుతుందో వేచి చూడాలి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం