నా ఫొటోలను పల్లీలు తినడానికి వాడేవారు, అదే నా డ్రీమ్ కార్, చిరంజీవితో ఆ సినిమా చేయాలి.. హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్-sai durga tej comments on his career and chiranjeevi pawan kalyan dream car in the fast and curious auto expo 2025 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నా ఫొటోలను పల్లీలు తినడానికి వాడేవారు, అదే నా డ్రీమ్ కార్, చిరంజీవితో ఆ సినిమా చేయాలి.. హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్

నా ఫొటోలను పల్లీలు తినడానికి వాడేవారు, అదే నా డ్రీమ్ కార్, చిరంజీవితో ఆ సినిమా చేయాలి.. హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

తాజాగా జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్-ఆటో ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో హీరో సాయి దుర్గ తేజ్ పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ సమాధానాలు ఇచ్చాడు. అలాగే, తన ఫొటోలను పల్లీలు తినడానికి వాడారాని, చిరంజీవితో అలాంటి సినిమా చేయాలని చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్

నా ఫొటోలను పల్లీలు తినడానికి వాడేవారు, అదే నా డ్రీమ్ కార్, చిరంజీవితో ఆ సినిమా చేయాలి.. హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ - ఆటో ఎక్స్‌పో 2025లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు.

బఠానీలు తినడానికి వాడేవారు

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఏం మాట్లాడారంటే.. "నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న టైంలో ఓ సారి మంచు మనోజ్ గారి ఆఫీస్‌లో వైవీఎస్ చౌదరీ గారు చూశారు. అలా ‘రేయ్’ చిత్రం ప్రారంభమైంది" అని తెలిపాడు.

"కానీ ఆ రేయ్ మూవీ షూటింగ్ టైంలో చాలా ఆర్థిక సమస్యలు వచ్చాయి. అయినా సరే పట్టువదలకుండా ప్రయత్నించాను. 2012లో ఓ సినిమా చేస్తున్న టైంలోనే ఓ ప్రముఖ నటులు చనిపోయారు. మళ్లీ 2013లో జగపతి బాబు గారితో రీ షూట్ చేశాం. పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అలా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నా కలల్ని మాత్రం వదిలి పెట్టలేదు" అని సాయి దుర్గ తేజ్ పేర్కొన్నాడు.

నన్ను గైడ్ చేస్తుంటారు

"నాకు పవన్ కళ్యాణ్ గారు ఓ గురువులాంటి వారు.. చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు.. ప్రతీ విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ ఇలా అన్నింట్లోనూ నన్ను గైడ్ చేశారు. కాలేజ్‌లో ఉండే ఫేవరేట్ టీచర్‌లా నాకు పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు" అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.

"నేను ప్రతీ సిచ్యువేషన్‌ని లైటర్ వేలోనే తీసుకుంటాను. ఏదీ కూడా సీరియస్‌గా తీసుకోను. ఎంత బ్యాడ్ జరిగినా కూడా నవ్వుతూ ఆ పరిస్థితిని దాటేస్తుంటాను. నేను హాస్పిటల్‌లో ఉన్న తరువాత బయటకు వచ్చాను. అందరూ అడుగుతూ ఉంటే.. కోమాలో ఉన్నాను అని చెప్పలేదు.. హాస్పిటల్‌కు అలా చిల్ అవ్వడానికి వెళ్లాను అని చెప్పాను" అని సాయి దుర్గ తేజ్ చెప్పాడు.

మాట సరిగా రాలేదు

"అందరూ హెల్మెట్ ధరించండి. వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తరువాత నాకు చాలా సమస్యలు వచ్చాయి. మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. నేను ఎన్నో పుస్తకాలు చదివే వాడిని.. ఎంతో వ్యాయామం చేసేవాడిని. నాకు ‘రిపబ్లిక్’ మూవీ చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు మళ్లీ వస్తే నేను చేస్తాను" అని సాయి దుర్గ తేజ్ పేర్కొన్నాడు.

"సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ని లింక్ చేయడం మన బాధ్యత అని నేను అనుకుంటాను. చిరంజీవి గారితో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి స్టోరీని చేయాలనే కోరిక ఉంది" అని మనసులోని కోరికను బయటపెట్టాడు సాయి ధరమ్ తేజ్.

ఆ కారు ఎప్పటికైనా కొంటాను

"నా గ్యారేజ్‌లో ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే నాకు చాలా ఇష్టం. 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు అంటే మరింత ఇష్టం. అది నాకు డ్రీమ్ కారు లాంటిది. కచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ కారుని కొంటాను" అని సాయి దుర్గ తేజ్ వెల్లడించాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం