Pawan Kalyan Sai Dharam Tej: పవన్ కల్యాణ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఫొటో వైరల్-sai dharam tej gifted star wars to pawan kalyan photo going viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Sai Dharam Tej: పవన్ కల్యాణ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఫొటో వైరల్

Pawan Kalyan Sai Dharam Tej: పవన్ కల్యాణ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఫొటో వైరల్

Hari Prasad S HT Telugu
Jun 16, 2024 03:45 PM IST

Pawan Kalyan Sai Dharam Tej: పవన్ కల్యాణ్ కు అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవర్ స్టార్ కు స్టార్ వార్స్ బహుమతిగా ఇవ్వడం విశేషం.

పవన్ కల్యాణ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఫొటో వైరల్
పవన్ కల్యాణ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఫొటో వైరల్

Pawan Kalyan Sai Dharam Tej: పవర స్టార్ పవన్ కల్యాణ్ విజయాన్ని అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికీ పవన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాడు. తాజాగా పవన్ ఇంటికి వెళ్లి ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వడం విశేషం. ఇంతకీ అతడు ఏమిచ్చాడో తెలుసా? స్టార్ వార్స్ గేమ్ సెట్. దీనికీ ఓ కారణం ఉంది.

పవన్ కల్యాణ్‌కు స్టార్ వార్స్ గిఫ్ట్

పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఎన్నికల్లో అతడు గెలవగానే ఇంటికి వెళ్లి భుజాలపైకి ఎత్తుకొని సంబరపడిపోయిన అతడు.. తిరుమలలో మొక్కు కూడా తీర్చుకున్నాడు. అలిపిరి నుంచి కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఇక ఇప్పుడు పవన్ ను కలిసి అతని ఫేవరెట్ గేమ్ స్టార్ వార్స్ ను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. అసలు స్టార్ వార్స్ తనకు పరిచయం చేసిందే పవన్ అని ఈ సందర్భంగా సాయి ధరమ్ చెప్పాడు. పవన్ కు తాను గిఫ్ట్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేశాడు.

"నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎం.. నన్ను స్టార్ వార్స్, లెగోకి పరిచయం చేసిన వ్యక్తికి.. మొత్తానికి ఇప్పుడు అతనిలోని పిల్లాడికి గిఫ్ట్ ఇచ్చే అవకాశం దక్కింది. తన యంగ్ పడువన్ నుంచి" అని క్యాప్షన్ తో ఈ ఫొటోను సాయి ధరమ్ షేర్ చేశాడు.

పవన్‌కు వదినమ్మ గిఫ్ట్

మంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు పవన్ కల్యాణ్ కు ఆయన అన్నయ్య చిరంజీవి, వదినమ్మ సురేఖ ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్టు చేశారు. కల్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి అని పోస్టు పెట్టారు. ఈ వీడియోలో పవన్ వదినమ్మ సురేఖ ఓ బహుమతి అందించారు. మాంట్ బ్లాంక్ పెన్నును చిరంజీవి, సురేఖ... పవన్ కల్యాణ్ కు అందించారు.

"తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తావని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ... వదిన, అన్నయ్య" అంటూ చిరంజీవి ఆ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కు చిరంజీవి, సురేఖ ఈ బహుమతి అందించారు.

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పెన్ను బహుమతి అందించారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కోరారు.

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కల్యాణ్ కుటుంబంతో సహా తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ మెగా కుటుంబం మొత్తం ఘనస్వాగతం పలికింది. ఈ వీడియో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పోస్టు చేయగా తెగ వైరల్ అయ్యింది.

WhatsApp channel