Ganja Shankar Notice: చిక్కుల్లో సాయి ధరమ్ తేజ్.. యాంటీ నార్కోటిక్స్ నోటీసులు.. ఆదిలోనే షాక్
Anti Narcotics Bureau Notice To Gaanja Shankar: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాంజా శంకర్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు పంపించారు. దీంతో ఆదిలోనే గాంజా శంకర్ మూవీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
NAB Notice To Ganja Shankar: మెగా కాంపౌండ్ నుంచి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత నటించిన విరూపాక్ష సినిమాతో భారీ హిట్ కొట్టాడు సాయి ధరమ్ తేజ్. అనంతరం బ్రో సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఇలా విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు ఈ మెగా హీరో. అయితే, తాజాగా సాయి ధరమ్ తేజ్‌కు షాక్ తగిలింది. చిక్కుల్లో పడ్డాడు సాయి ధరమ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్ పూర్తి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా గాంజా శంకర్. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భీమ్స్ సిసిరోలియో గాంజా శంకర్‌కు సంగీతం అందిస్తున్నారు.
ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న గాంజా శంకర్ మూవీకి తాజాగా షాక్ తగిలింది. నాలుగు నెలల క్రితం ప్రటించిన ఈ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగినట్లు అయింది. తాజాగా గాంజా శంకర్ చిత్ర బృందానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. మూవీ టైటిల్‌లోని గాంజా అనే పదాన్ని తొలగించాలని అధికారులు సూచించారు. సినిమాలో కూడా డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు, యువతపై గాంజా శంకర్ టైటిల్ ప్రభావం చూపించే అవకాశం ఉందని, వెంటనే ఆ పేరు మార్చాలని సూచిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులపై గాంజా శంకర్ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే గాంజా శంకర్ సినిమా ప్రారంభించిన నాలుగు నెలలు కావొస్తుంది. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్ చేశారు. అది చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు.
అయితే, గాంజా శంకర్ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి చాలా రోజులైన ఇప్పటివరకు సినిమా సెట్స్‌పైకి వెళ్లినట్లు సమాచారం లేదు. దాంతో ఒక దశలో సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు టీఎస్ న్యాబ్ నుంచి నోటీసులు రావడంతో మరోసారి గాంజా శంకర్‌పై దృష్టి మళ్లింది. అయితే, ఆగిపోయిన మూవీకి నోటీసులు రావడం ఏంటబ్బా అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల రహదారి భద్రతపై హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నాడు సాయి ధరమ్ తేజ్. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సూచనలు చేశాడు సాయి తేజ్. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపొద్దని కోరాడు. కాగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకే సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మూవీకి నోటీసులు రావడం గమనార్హం.