Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ సింగర్స్ కుమారుడు? ఎవరీ సాయి అభయంకర్
Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మరో మరోసారి టాక్‍లోకి వచ్చేసింది. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమంటూ తాజాగా సమాచారం వెల్లడైంది. అయితే, ఈ మూవీకి సాయి అభయంకర్ పేరును సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారట. ఇతడు ఎవరంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప 2: ది రూల్ చిత్రంతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించారు. అనేక రికార్డులను బద్దలుకొట్టారు. తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తారని గతంలో ప్రకటన వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టినట్టు తెలిసింది. అయితే, అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వీరి కాంబినేషన్‍లో మూవీకి ఉండనుందని తాజాగా సమాచారం వెల్లడైంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‍తో అట్లీ చేయాల్సిన ఓ భారీ మూవీ క్యాన్సల్ అయినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇటీవలే అట్లీ టీమ్.. అల్లు అర్జున్‍ను మరోసారి కలిసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు బన్నీ అంగీకరించారట. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేయనుంది. త్రివిక్రమ్, అట్లీల్లో ఎవరి మూవీని అల్లు అర్జున్ ముందుగా చేస్తారో చూడాలి. అయితే, ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ కాకుండా.. ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఎవరు ఈ సాయి అభయంకర్?
అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సాయి అభయంకర్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. దీంతో ఎవరు ఇతడు అనే ఆసక్తి పెరిగిపోయింది. స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడే ఈ సాయి అభయంకర్. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాటలతో చాలా పాపులర్ అయ్యారు.
సాయి అభంకర్ కంపోజ్ చేసిన ‘కట్చి సేరా’, ‘ఆసా కూడ’ ప్రైవేట్ పాటలు చాలా సక్సెస్ అయ్యాయి. యూట్యూబ్‍లో 200 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరితోనూ ఓ పాట చేశారు అభయంకర్. లోకేశ్ కనగరాజ్ స్టోరీ అందిస్తున్నబెంజ్ చిత్రానికి 20ఏళ్ల సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు ఆర్జే బాలాజీతో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్న చిత్రానికి కూడా అతడు మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ - అట్లీ మూవీకి అతడిని టీమ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇది ఓకే అయితే సాయి అభంకర్ ఇక పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.
సల్మాన్‍తో అట్లీ ప్రాజెక్ట్ రద్దు!
కాగా, జవాన్ చిత్రంతో బాలీవుడ్‍లో అడుగుపెట్టారు అట్లీ. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఆ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దీంతో బాలీవుడ్‍పైనే ఫోకస్ చేయాలని అనుకున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా భారీ మూవీని తెరకెక్కించాలని భావించారు. ఈ చిత్రం కోసం చాలా వర్క్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందని తెలుస్తోంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్నది మైథలాజికల్ మూవీ అని కూడా రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో ఉంటుందని తెలుస్తోంది. అట్లీతో చేసే చిత్రం దాదాపు యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొదలైతే.. ఇదే ముందు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్టుపై మళ్లీ అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో చూడాలి.
సంబంధిత కథనం