Sabari Review: శబరి రివ్యూ - వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Sabari Review: వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Sabari Review: తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా వైవిధ్యతను చాటుకుంటోంది వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar). ఆమె హీరోయిన్‌గా సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన శబరి మూవీ (Sabari Movie) శుక్రవారం థియేటర్ల లో రిలీజైంది.
ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచమయ్యారు. గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రల్లో న టించిన ఈ సినిమాను మహేంద్రనాథ్ నిర్మించాడు. శబరి ఎలా ఉంది? ఈ సినిమాతో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తెలుగులో హిట్ దక్కిందా? లేదా? అంటే?
సంజన కథ…
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్) ధైర్యవంతురాలైన మహిళ. పెద్దలను ఎదురించి అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం తెలిసి భర్తకు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష) కలిసి వైజాగ్ వచ్చేస్తోంది సంజన. ఉద్యోగ ప్రయత్నాలు చేసినా డిగ్రీ కూడా పూర్తిచేయకపోవడంతో ఎవరూ ఆమెకు జాబ్ ఇవ్వరు.
కాలేజీ ఫ్రెండ్ అయిన లాయర్ రాహుల్ (శశాంక్) సహాయంతో జుంబా ట్రైనర్‌గా ఓ జాబ్ సంపాదిస్తుంది. సంజన ఆచూకీ కోసం సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వెతుకుతుంటాడు. సంజన వైజాగ్‌లో ఉందని తెలిసి అక్కడికి వచ్చి ఆమెను వెంబడిస్తుంటాడు. సూర్య బారి నుంచి తనతో పాటు కూతురిని కాపాడుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంజన. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తేలుతుంది. సంజననే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్ధారిస్తారు. అసలు సూర్య ఎవరు?
అతడు సంజన కోసం వెతకడానికి కారణం ఏమిటి? సంజన కూతురు రియాకు సూర్యకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీసులు చెప్పినట్లుగా నిజంగానే సూర్య చనిపోయాడా? సంజన గతం ఏమిటి? భర్త అరవింద్ నుంచి సంజన ఎందుకు దూరమైంది? కూతురు రియాను తన దగ్గరకు రప్పించేందుకు అరవింద్ ఏం చేశాడు? సూర్య, అరవింద్ పన్నాగాల నుంచి తన కూతురిని సంజన ఎలా కాపాడుకుంది అన్నదే శబరి (Sabari Review)మూవీ కథ.
తల్లి పోరాటం...
తన కూతురిని కాపాడుకోవడానికి ఓ తల్లి సాగించిన పోరాటం నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ శబరి కథను రాసుకున్నాడు. సాధారణంగా తల్లీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ముడిపడిన కథలు సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంటాయి. కానీ అనిల్ కాట్జ్ మాత్రం సైకలాజికల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా శబరి మూవీని తెరకెక్కించాడు.
ట్విస్ట్‌లే బలం...
థ్రిల్లర్ సినిమాకు ట్విస్ట్‌లే ప్రధాన బలం. కథలోని మలుపులు ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది. శబరిలో(Sabari Review) కొన్ని ట్విస్ట్‌లను సర్‌ప్రైజింగ్‌గా ఆడియెన్స్ ఊహలకు అందకుండా రాసుకున్నాడు డైరెక్టర్. కూతురి కోసం తల్లి పడే ఆరాటం చుట్టూ సస్పెన్స్ డ్రామాను అల్లుకుంటూ చివరి వరకు ఎంగేజింగ్‌గా శబరిని నడిపించారు.
సెకండాఫ్ హైలైట్...
సూర్య క్యారెక్టర్‌తోనే సినిమా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సంజన భర్తకు దూరంగా కూతురితో కలిసి వైజాగ్ రావడం, ఆమె చేసే ఉద్యోగ ప్రయత్నాలు, చిన్నతంలోనే తల్లికి దూరమై సంజన(Sabari Review) పడిన ఆవేదన చుట్టూ ఫస్ట్ హాఫ్‌ను నడిపించారు డైరెక్టర్.
రియాకు, సూర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని ఇంటర్వెల్‌లో రివీల్ చేసి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ. ఫస్ట్ హాఫ్‌ను నెమ్మదిగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో మాత్రం స్క్రీన్‌ప్లే విషయంలో తన పట్టును ప్రదర్శించారు. సూర్య నుంచి కూతురిని శబరి కాపాడుకునే సీన్స్, ఈ క్రమంలో సూర్య, శబరి పాత్రలకు సంబంధించి రివీలయ్యే ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి.
సస్పెన్స్‌తో పాటు హారర్ ఫీల్ కలిగేలా ఆ సీన్స్‌ను స్క్రీన్‌పై డెరెక్టర్ ప్రజెంట్ చేశాడు. ఇంటన్స్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
లాజిక్స్ మిస్...
శబరిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే డ్రామా ఎక్కువైపోవడం కొన్ని చోట్ల బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. అసలు కథలోకి ఎంట్రీ కావడానికి డైరెక్టర్ కాస్త టైమ్ ఎక్కువ తీసుకున్నాడు. సూర్య క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే లాజిక్ అంతగా కన్వీన్సింగ్‌గా అనిపించదు.
వరలక్ష్మి వన్ ఉమెన్ షో...
శబరి మూవీకి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ పెద్ద బలం. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఎమోషనల్ రోల్‌కు ఆమెను ఎంచుకోవడంలో దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. సంజన పాత్రకు వరలక్ష్మి శరత్‌కుమార్ పూర్తిగా న్యాయం చేసింది. కూతురిని కాపాడుకోవడానికి ఆరాటపడే తల్లిగా చక్కటి నటనను కనబరిచింది.
సొసైటీలో సింగిల్ మదరకు ఎదురయ్యే కష్టాలను ఆమె క్యారెక్టర్ ద్వారా చక్కగా చూపించారు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో గణేష్ వెంకట్రామన్, విలన్‌గా మైమ్ గోపి మెప్పించారు.
శశాంక్ కు మంచి రోల్ దక్కింది. నివేక్ష నటన ఆకట్టుకుంటుంది. గోపీ సుందర్ మ్యూజిక్, బీజీఎమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కథలోని థ్రిల్ ఫీల్‌ను తన మ్యూజిక్‌తో చాలా చోట్ల ఎలివేట్ చేశాడు గోపీసుందర్. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
సైకలాజికల్ థ్రిల్లర్...
శబరి సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో సాగే డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.
రేటింగ్: 2.75/5