Sabar Bonda Review: సబర్ బోండా రివ్యూ- స్వలింగ సంపర్కుల ప్రేమకథ- మరాఠీ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?-sabar bonda movie review in telugu first marathi film at sundance film festival of rohan kanawade sabar bonda explained ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sabar Bonda Review: సబర్ బోండా రివ్యూ- స్వలింగ సంపర్కుల ప్రేమకథ- మరాఠీ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Sabar Bonda Review: సబర్ బోండా రివ్యూ- స్వలింగ సంపర్కుల ప్రేమకథ- మరాఠీ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2025 12:42 PM IST

Sabar Bonda Movie Review In Telugu: స్వలింగ సంపర్కంపై తెరకెక్కిన రూరల్ బ్యాక్‌డ్రాప్ బోల్డ్ మూవీ సబర్ బొండా. రోహన్ కనవాడే దర్శకత్వం వహించిన ఈ మరాఠీ సినిమాను ప్రస్తుతం సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా థియేటర్లలో విడుదల కానీ ఈ సినిమా ఎలా ఉందో సబర్ బొండా రివ్యూలో తెలుసుకుందాం.

సబర్ బోండా మూవీ రివ్యూ
సబర్ బోండా మూవీ రివ్యూ

Sabar Bonda Movie Review In Telugu: భారతదేశంలో స్వలింగ సంపర్కుడిగా ఉండటం అంటే ఏమిటి? ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ పట్ల సానుకూలంగా స్పందించే ఆధునిక దృక్పథాలు కలిగిన ప్రజలు ఉన్న మహానగరం కాదు భారతదేశం. ఇప్పటికీ ఇండియాలో స్వలింగ సంపర్కులపై కాస్తా చిన్నచూపు ఉంటుంది.

yearly horoscope entry point

అలాంటిది గ్రామాల్లో, పల్లెల్లో నివసించే హోమో సెక్సువల్స్ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా ఉంటుంది. లోతైన సంప్రదాయవాద మత, సామాజిక ప్రమాణాలతో గ్రామాలు పాతుకుపోయి ఉంటాయి. అలాంటి పల్లెలు స్వలింగ సంపర్కులపై సానుకూలంగా స్పందించే ఆలోచన నుంచి బయటకు రావడం చాలా కష్టమైనదే. ఎందుకంటే ఈ విధానం వివాహం చేసుకోవడానికి, వంశాన్ని నిలబెట్టేందుకు, కుటుంబ ఆంక్షలు, సామాజిక ఒత్తిళ్లతో పోరాడాల్సి ఉంటుంది.

ఫీచర్ బోల్డ్ మూవీగా

ఈ విషయాన్నే రోహన్ పరశురామ్ కనవాడే సినిమాగా తెరకెక్కించారు. స్వలింగ సంపర్కంపై మరాఠీ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కిందే సబర్ బోండా. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సబర్ బోండా హాలీవుడ్ డ్రామా చిత్రం కాక్టస్ పేర్స్ (Cactus Pears Movie)కు రీమేక్ అని తెలుస్తోంది.

అయితే, సబర్ బొండా సినిమాను జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2 మధ్య జరిగే సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ ఏడాది సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన తొలి ఇండియన్ మూవీగా సబర్ బొండా రికార్డ్ కొట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి సబర్ బొండా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఆనంద్ (భూషన్ మనోజ్) తండ్రి చనిపోవడంతో షాక్ అవుతాడు. తన తల్లితో కలిసి తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి పది రోజుల పాటు చావుకు సంబంధించి సాగే ఆచారాలు, పద్ధతులు, సాంప్రాదాయాలను ఆనంద్ తెలుసుకోవాల్సి ఉంటుంది. తన తండ్రి మరణంతో కుటుంబం, బంధువుల నుంచి ఒకరకమైన బాధ కనిపిస్తుంది.

మరోవైపు 30 ఏళ్లు వచ్చిన ఆనంద్ ఇంకా పెళ్లి చేసుకోడు ఆనంద్‌కు పెళ్లిపై అయిష్టం ఉండటంతో తల్లి కూడా ఫోర్స్ చేయదు. ఈ క్రమంలోనే తన పక్కింటి స్నేహితుడు, రైతు బల్యా (సురాజ్ సుమన్)ను కలుసుకుంటాడు ఆనంద్. కొండ ప్రాంతాల్లో బల్యా మేకలు మేపుతుంటాడు. ఓ సందర్భంలో తనలాగే బల్యా కూడా స్వలింగ సంపర్కుడు అని తెలుస్తుంది.

ట్విస్టులు

ఆ తర్వాత ఆనంద్, బల్యా మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటీ? స్వలింగ సంపర్కులైన ఇద్దరు ఏం చేశారు? వీరి కారణంగా గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ? వీరి ప్రేమను గ్రామస్థులు ఎలా తీసుకున్నారు? చివరికీ ఏం జరిగింది? అనేదే సబర్ బొండా మూవీ కథ.

విశ్లేషణ:

ఒక మారుమూల ప్రాంతంలో హోమో సెక్సువల్స్ ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో సబర్ బొండా తెరకెక్కింది. గ్రామీణ మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు యుక్త వయుల్లో ఒకరిని ఒకరు ప్రేమించడం, కలిసి జీవించడానికి చేసే ప్రయత్నాలతో సినిమా సాగుతుంది. అయితే, హీరో తండ్రి చనిపోవడం, తర్వాత అంత్యక్రియలు, ఆచారాల సీన్లతో గ్రామస్థుల పట్టింపులు, సాంప్రాదాయాలు ఎలా ఉంటాయో ఓ ఉదాహరణగా చూపించారు.

ఆ తర్వాత ఆనంద్, బల్యా హోమో సెక్సువల్స్ అని రివీల్ అయ్యే సీన్‌ను చాలా డ్రామాటిక్‌గా చూపించారు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతగా కలుసుకునేందుకు చేసే ప్రయత్నాలు, ఒకరిపై మరొకరికి ఉన్న ఎమోషన్ వంటివి ఆకట్టుకుంటాయి. అయితే, సెకండాఫ్‌లో సినిమా కాస్తా స్లోగా సాగుతుంది. కానీ, నటీనటుల పర్ఫామెన్స్‌ అలరిస్తుంది. గ్రామస్థుల నుంచి వచ్చే వ్యతిరేకత, ఆనంద్, బల్యా నిలబడే తీరు బాగానే చూపించారు.

రెండు సినిమాల స్ఫూర్తితో

అయితే, 2017లో జోష్ ఓ కానర్ నటించిన గాడ్స్ ఓన్ కంట్రీలో చూపించిన క్రూరమైన శృంగారం సబర్ బోండాలో కనిపించిది. సబర్ బొండా గాడ్స్ ఓన్ కంట్రీ, కాక్టస్ పెర్స్ రెండు చిత్రాల స్ఫూర్తితో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంకా థియేటర్లలో విడుదల కానీ సబర్ బోండా క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం