Saaree Director About Aaradhya Devi In Trailer Launch: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఆకట్టుకుంది ఆరాధ్య దేవి. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్ చేసే ఆరాధ్య దేవిని చీరలో చూసిన రామ్ గోపాల్ వర్మ శారీ మూవీకి హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దాంతో తెలుగులో ఆరాధ్య దేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మూల కథ అందించిన శారీ సినిమాలో ఆరాధ్య దేవితోపాటు సత్య యాదు ప్రధాన పాత్రలో నటించాడు. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన శారీ మూవీకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించిన శారీ ఏప్రిల్ 4న విడుదల కానుంది.
తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్న శారీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మార్చి 20న శారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య దేవితోపాటు డైరెక్టర్ గిరి కృష్ణ కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ గిరి కృష్ణకమల్ మాట్లాడుతూ.. "శారీ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రాన్ని రూపొందించేప్పుడు నేను స్వతహాగా ఏం చేయగలనో చూపించాలని అనుకున్నాను. మొదట కొంత షూట్ చేసి వర్మ గారికి చూపించాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాకు నాకు ఇద్దరు గొప్ప యాక్టర్స్ సత్య యాదు, ఆరాధ్య రూపంలో దొరికారు" అని తెలిపారు.
"ఆరాధ్య దేవి ఎలా నటిస్తుందో నాకు తెలియదు. ఆమె రీల్స్ మాత్రమే చూశాను. కానీ, ఫెంటాస్టిక్‌గా నటించింది. సత్య యాదు కొన్ని సీన్స్‌లో ఎదుట ఏ యాక్టర్ లేకుండా తనకు తాను పర్‌ఫార్మ్ చేయాల్సి వచ్చేది. అలాంటి సీన్స్‌లో సత్య బాగా నటించాడు. వీరిద్దరు బాగా పర్‌ఫార్మ్ చేయడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది" అని శారీ డైరెక్టర్ గిరి కృష్ణ కమల్ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ ఆరాధ్య దేవి మాట్లాడుతూ.. "శారీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణ కమల్. ఈ సినిమా చేయడం నాకొక వర్క్ షాప్‌లా అనిపించింది" అని చెప్పింది.
"సత్య యాదు మంచి కోస్టార్. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. శారీ సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఏప్రిల్ 4న థియేటర్స్‌లోకి వస్తున్న శారీ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని హీరోయిన్ ఆరాధ్య దేవి తన స్పీచ్ ముగించింది.
హీరో సత్య యాదు మాట్లాడుతూ.. "ఆడిషన్ కోసం అప్లై చేసుకోవడం ద్వారా శారీ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. నేను సెలెక్ట్ అయిన తర్వాత ఆర్జీవీ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్జీవీ ఫోన్ చేశాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను" అని అన్నాడు.
"శారీ మూవీలో నా క్యారెక్టర్ చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది. పాత్రను అర్థం చేసుకుని నటించేందుకు కావాల్సిన స్వేచ్ఛ దర్శకుడు కృష్ణ కమల్ ఇచ్చారు. నాకు కెమెరా ఫియర్ ఉండేది. ఆరాధ్యకు మాత్రం అలాంటిదేం లేదు. బాగా నటించింది" అని సత్య యాదు తెలిపాడు.
సంబంధిత కథనం