The Pope Exorcist Release Date: వారం ముందుగానే ఇండియాలో రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్ -russell crowe the popes exorcist movie to release in theaters on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Pope Exorcist Release Date: వారం ముందుగానే ఇండియాలో రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్

The Pope Exorcist Release Date: వారం ముందుగానే ఇండియాలో రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్

Nelki Naresh Kumar HT Telugu
Apr 01, 2023 02:19 PM IST

The Pope Exorcist Release Date: ఆస్కార్ విన్న‌ర్ ర‌సెల్ క్రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్ మూవీ ఇండియాలో వారం ముందుగానే రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చేది ఎప్పుడంటే..

ది పోప్ ఎగ్జార్సిస్ట్
ది పోప్ ఎగ్జార్సిస్ట్

The Pope Exorcist Release Date: గ్లాడియేట‌ర్ ఫేమ్‌, ఆస్కార్ విన్న‌ర్ ర‌సెల్ క్రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్ మూవీ వారం ముందుగానే ఇండియాలో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 7న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల‌చేస్తోన్నారు.

సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు జూలియ‌స్ అవేరీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇందులో ర‌సెల్ క్రోతో పాటు డేనియ‌ల్ జోవాట్టో, అలెక్స్ ఎస్సో కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు. వాటిక‌న్ సిటీలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా హార‌ర్ క‌థాంశంతో ది పోప్స్‌ ఎగ్జార్సిస్ట్ ఈ సినిమా తెర‌కెక్కింది. వాటిక‌న్ సిటీకి చెందిన ఫాద‌ర్ గాబ్రియేల్ సైతాన్ ఆధీనంలో ఉన్న డెమాన్స్‌తో సాగించే పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌నుంది.

ఓ యువ‌కుడితో క‌లిసి వాటిక‌న్ సిటీకి చెందిన శ‌తాబ్దాల‌క్రితం నాటి ఓ కుట్ర‌ను ఫాద‌ర్ గాబ్రియేల్‌ ఎలా వెలికితీశాడు. ఈ క్ర‌మంలో వారికి ఎదురైన ప‌రిణామాల‌తో జూలియ‌స్ అవేరీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. పీరియాడిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇండియాలో రిలీజ్ చేస్తోంది.ఇండియాలో ఈసినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుండ‌గా అమెరికాలో మాత్రం ఏప్రిల్ 14న విడుద‌ల‌కానుంది.

టాపిక్