Anupama Tv Serial: సీరియల్ కోసం 20 కోట్ల రెమ్యునరేషన్ - టీవీ యాక్టర్స్‌లో ఆమెనే టాప్
Anupama Tv Serial: హిందీలో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోన్న సీరియల్స్‌లో ఒకటిగా స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతోన్న అనుపమ నిలుస్తోంది. ఈ సీరియల్ కోసం టైటిల్ పాత్రలో నటిస్తోన్న రూపాలీ గంగూలీ ఎంత రెమ్యునరేషన్ స్వీకరిస్తుందంటే...
Anupama Tv Serial: టీవీ సీరియల్ యాక్టర్స్ రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉంటుంది. సీరియల్ మొత్తం పూర్తయ్యేసరికి మహా అయితే కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకోవడం కష్టమే. కానీ హిందీ సీరియల్ యాక్టర్ రూపాలీ గంగూలీ మాత్రం అనుపమ సీరియల్ కోసం సినిమా హీరోయిన్లకు ధీటుగా రెమ్యునరేషన్ అందుకుంటోంది.
ట్రెండింగ్ వార్తలు
నార్త్, సౌత్ మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న సీరియల్ ఆర్టిస్ట్‌గా రుపాలీ గంగూలీ నిలిస్తోంది. ప్రస్తుతం హిందీలో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోన్న సీరియల్స్‌లో అనుపమ ఒకటిగా నిలుస్తోంది. రూపాలీ గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సీరియల్ స్టార్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమవుతోంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోనూ ఈ సీరియల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీరియల్‌లో అనుపమగా టైటిల్ పాత్రలో చక్కటి నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది రూపాలీ గంగూలీ. కాగా ఈ సీరియల్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం రూపాలీ గంగూలీ దాదాపు 3 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటోన్నట్లు సమాచారం.
ఇప్పటివరకు దాదాపు 700లకుపైగా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. వీటన్నింటి కోసం ఆమె 21 కోట్లకుపైగా పారితోషికాన్ని స్వీకరించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సమానంగా రూపాలీ గంగూలీ సీరియల్ కోసం రెమ్యునరేషన్‌ను స్వీకరించడం గమనార్హం.
ఈ సీరియల్‌లో రూపాలీ గంగూలీతో పాటు సుధాన్షు పాండే, గౌరవ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. అనుపమ సీరియల్‌కు రోమెస్ కల్రా దర్శకత్వం వహిస్తోన్నాడు.