MS Dhoni in RC16: రామ్‍చరణ్ సినిమాలో ధోనీ క్యామియో రోల్? చక్కర్లు కొడుతున్న క్రేజీ రూమర్.. నిజమిదే!-rumours about ms dhoni to play a cameo role in ram charan rc16 movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ms Dhoni In Rc16: రామ్‍చరణ్ సినిమాలో ధోనీ క్యామియో రోల్? చక్కర్లు కొడుతున్న క్రేజీ రూమర్.. నిజమిదే!

MS Dhoni in RC16: రామ్‍చరణ్ సినిమాలో ధోనీ క్యామియో రోల్? చక్కర్లు కొడుతున్న క్రేజీ రూమర్.. నిజమిదే!

MS Dhoni in RC16: రామ్‍చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నటించనున్నారనే ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఆ వివరాలివే…

ఓ యాడ్ షూట్ సందర్భంగా గతంలో ధోనీ, రామ్‍చరణ్ కలిసిన చిత్రమిది

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍కు ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీ నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మూవీ (RC16) చేస్తున్నారు చరణ్. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. కండలు బాగా పెంచేశారు చెర్రీ. ఈ మూవీపై ప్రస్తుతం ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవే..

క్యామియో రోల్‍లో ధోనీ అంటూ..

రామ్‍చరణ్ - బుచ్చిబాబు మూవీలో భారత దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్యామియో రోల్‍లో కనిపించనున్నారంటూ తాజాగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంతో ధోనీ తెరంగేట్రం చేయనున్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍ ఉండే ఆర్‌సీ16లో రామ్‍చరణ్‍కు కోచ్‍గా కాసేపు ధోనీ కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్పందించిన టీమ్

ఆర్‌సీ16లో ధోనీ నటిస్తారనే రూమర్లు ఎక్కువవుతుండటంతో మూవీ టీమ్ స్పందించింది. ఈ చిత్రంలో ధోనీ నటించడం లేదని, ఆ దిశగా చర్చలు జరగలేదని వెల్లడించింది. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

ఇద్దరి మధ్య పరిచయం

రామ్‍చరణ్, ధోనీ మధ్య మంచి పరిచయాలే ఉన్నాయి. గతంలో ముంబైలో కలిసి ఓ యాడ్ షూట్ కూడా చేశారు. అప్పుడు కలిసి మాట్లాడుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

ఆర్‌సీ16 మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ చిత్రం కోసం భారీగా బాడీ పెంచారు చెర్రీ. గడ్డం, జుట్టు కూడా ఎక్కువగా పెంచారు. రగెడ్ లుక్‍లో ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో.. లేకపోతే వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ఎక్కువగా వీఎఫ్‍ఎక్స్ అవసరం లేకపోవటంతో ఇది సాధ్యమవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఆర్‌సీ16 చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‍ను పరిగణిస్తున్నట్టు చాలా కాలంగా రూమర్లు ఉన్నాయి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.

వార్నర్.. తెలుగు మూవీతోనే…

కాగా, తెలుగు మూవీ రాబిన్‍హుడ్‍తో తెరంగేట్రం చేస్తున్నారు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వార్నర్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం