Highest Grossing Telugu Movies in Bollywood: బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపించిన తెలుగు సినిమాలు ఇవే
ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. కలెక్షన్స్ పరంగా రికార్డులను కొల్లగొట్టాయి. 2022 ఏడాదిలో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన బాలీవుడ్ సినిమాలు ఏవంటే...
ఈ ఏడాది అద్భుత విజయాలతో టాలీవుడ్ మెరిసింది. బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు మిగిలిన భాషలకు చెందిన సినిమాలు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేసుకోవడానికి ఇబ్బందులు పడగా టాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద అలవోకగా వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీను టాలీవుడ్ డామినేట్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు మించి కలెక్షన్స్ సాధించాయి. 2022 ఏడాదిలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాలు ఏవంటే...
ట్రెండింగ్ వార్తలు
ఆర్ఆర్ఆర్ - 277 కోట్లు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చారిత్రక చిత్రం ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ లో 277 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఏడాది హిందీలో టాప్ గ్రాసర్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. పీరియాడిక్ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన తీరుతో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్ యాక్టింగ్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
కార్తికేయ 2 - 30.55 కోట్లు
బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సర్‌ప్రైజింగ్ హిట్‌గా నిలిచింది కార్తికేయ 2. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీలో దాదాపు 30.55 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. తొలిరోజు ఈ సినిమాకు హిందీలో కేవలం ఏడు లక్షలు మాత్రమే వచ్చాయి. మౌత్ టాక్ బాగుండటం రోజురోజుకు వసూళ్లు పెరిగాయి. రక్షాబంధన్, లాల్ సింగ్ ఛడ్డా లాంటి సినిమాలకు పోటీగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.
రాధేశ్యామ్ - 19 కోట్లు
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమైంది. హిందీలో రాధేశ్యామ్ దాదాపు 19 కోట్ల వరకు వసూళ్లను సాధించింది.
లైగర్ -16 కోట్లు
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా హిందీలో 16 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ హిందీలో అరంగేట్రం చేశాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో లైగర్ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.
మేజర్ - 12 కోట్లు
అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. ముంబాయి ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 66 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో దాదాపు 13 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది.
సీతారామం - ఎనిమిది కోట్లు
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతారామం సినిమా హిందీలో ఎనిమిది కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్న కీలక పాత్ర పోషించింది.
గాడ్‌ఫాదర్ - ఎనిమిది కోట్లు
మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా సినిమా గాడ్‌ఫాదర్ రెండు వారాల్లోనే బాలీవుడ్‌లో 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ గెస్ట్‌గా నటించడంతో హిందీలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. గాడ్‌ఫాదర్ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించాడు.