Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు-rrr documentary squid game 2 to bhool bhulaiyaa 3 netflix ott top 4 releases this week steaming details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు

Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 25, 2024 02:53 PM IST

Netflix OTT Top Release This week: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. రెండు చిత్రాలు రానున్నాయి. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీతో పాటు స్కిడ్ గేమ్ రెండో సీజన్ అడుగుపెట్టనుంది.

Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు
Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు

పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘నెట్‍ఫ్లిక్స్’లో ఈ వారంలోనూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. క్రిస్మస్ వీక్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి. అందులో ఈ వారం నాలుగు ముఖ్యమైన రిలీజ్‍లుగా ఉన్నాయి. బ్లాక్‍బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీ అడుగుపెట్టనుంది. రెండు చిత్రాలు కూడా రానున్నాయి. ఎంతో ఎదురుచూస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా వచ్చేస్తోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ముఖ్యమైన నాలుగు ఓటీటీ రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

yearly horoscope entry point

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‍చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. 2022లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. పాన్ వరల్డ్ రేంజ్‍లో రాజమౌళికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాటునాటు పాట ఆస్కార్ అవార్డు సాధించింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన డాక్యుమెంటరీ వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించడం వెనుక చేసిన కృషి, కష్టం ఈ డాక్యుమెంటరీలో ఉండనుంది. సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే దగ్గరి నుంచి భారీ సెట్‍లు వేయడం, చిత్రీకరణ, నటీనటులు, టెక్నిషియన్‍ల కృషి సహా చాలా విషయాలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయి. డిసెంబర్ 20న పరిమిత థియేటర్లలో ఈ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రిలీజైంది. డిసెంబర్ 27న నెట్‍ఫ్లిక్స్‌లోకి వచ్చే ఈ డాక్యుమెంటరీని మిస్ కాకుండా చూడండి.

భూల్ భులయ్యా 3

బాలీవుడ్ హారర్ కామెడీ సినిమా భూల్ భులయ్యా 3 చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 27) స్ట్రీమింగ్‍కు రానుంది. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 1వ తేదీన విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం సుమారు రూ.417కోట్ల కలెక్షన్లు సాధించింది. భూల్ భులయ్యా 3 మూవీకి అనీస్ అజ్మీ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భూల్ భులయ్యా 3 స్ట్రీమింగ్ షురూ కానుంది.

సొర్గవాసల్

తమళి థ్రిల్లర్ మూవీ సొర్గవాసల్ డిసెంబర్ 27 తేదీనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో నవంబర్ 29వ తేదీన రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని డైరెక్టర్ సిద్ధార్థ్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో చూసేయవచ్చు.

స్క్విడ్ గేమ్ సీజన్ 2

పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‍కు రెండో సీజన్ ఈ వారంలోనే డిసెంబర్ 26న మధ్యాహ్నం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చిన స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎక్కువ మంది చూసిన సిరీస్‍గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. రేపు (డిసెంబర్ 26) రెండో సీజన్ వచ్చేస్తోంది. స్క్విడ్ గేమ్ 2 కొరియన్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ బాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం