ఎన్టీఆర్,రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. విడుదలకు మరో పది రోజులు మాత్రమే గడువు ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ‘ఎత్తర జెండా’ పేరుతో ‘‘ఆర్ఆర్ఆర్’ సెలబ్రేషన్స్ ఆంథమ్’ ప్రోమోను విడుదలచేశారు. ఫోక్ స్టైల్ లో సాగిన ఈ సాంగ్ ప్రోమోలో ఎన్టీఆర్,రామ్‌చరణ్,అలియాభట్ తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ ప్రోమో అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఫుల్ సాంగ్ ను ఈ నెల 14న విడుదలచేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. సోమవారం పూర్తి పాటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. సాంగ్ మరో గంటలో రిలీజ్ అవుతుందనగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల పాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ రోజు కాకుండా రేపు పది గంటలకు విడుదలచేస్తామని ప్రకటించింది. దాంతో ఎన్టీఆర్,రామ్‌చరణ్ అభిమానులు రాజమౌళితో పాటు నిర్మాణ సంస్థపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కటి అప్ డేట్ కూడా చెప్పిన టైమ్‌కు రిలీజ్ చేయలేదని విమర్శిస్తున్నారు. సీఏం జగన్ తో ‘ఆర్ఆర్ఆర్’ బెపిఫిట్ షోస్,టికెట్ ధరలపై చర్చించేందుకు రాజమౌళి ఏపీ వెళ్లారు. మీటింగ్స్ పై ఉన్న శ్రద్ధ ప్రమోషన్స్ పై లేదంటూ రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. ఇలా వాయిదా వేయడానికి నాలుగు రోజులు ఎందుకు హడావిడి చేశారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
టాపిక్