RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై డాక్యుమెంటరీ - టైటిల్ ఇదే - ఏ ఓటీటీలో చూడాలంటే?
RRR Movie: ఆస్కార్ అవార్డును గెలుచుకొని చరిత్రను సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ఈ డాక్యుమెంటరీకి ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
RRR Movie: రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంటరీ రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌పై మేకర్స్ సోమవారం క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఫస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్రను తిరగరాసింది. నాటు నాటు పాటకుగాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్నది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్‌తో పాటు అంతర్జాతీయ స్ధాయిలో ఎన్నో అవార్డులను అందుకున్నది.
బిహైండ్ అండ్ బియాండ్
ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. ఈ డాక్యుమెంటరీ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో రాజమౌళి ఛైర్‌లో కూర్చొని ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తోన్నాడు.
అతడి కింద వందలాది సినిమా రీల్స్ కనిపిస్తోన్నాయి. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీని డిసెంబర్‌లో (ఈ నెలలోనే) రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రికార్డులు..అవార్డులు...
తెలుగు సినిమాగా మొదలై ఆస్కార్ లెవెల్‌కు ఆర్ఆర్ఆర్ ఎలా చేరింది? సినిమా రూపకల్పనలో యూనిట్ ఎదుర్కొన్న సవాళ్లు, మూవీ సాధించిన అవార్డులు, రికార్డుల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం.
1300 కోట్ల కలెక్షన్స్...
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1387 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూడో సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. బాహుబలి 2 తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది.
ఫిక్షనల్ స్టోరీ...
1920 బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కించాడు. అలియా భట్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందించాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆర్ ఆర్ ఆర్ మూవీకి కథను అందించాడు.
ఆర్ఆర్ఆర్ మూవీ కథ ఇదే...
ఆదిలాబాద్‌లోని గోండ్ ప్రాంతానికి వేట కోసం బ్రిటీష్ గవర్నర్ స్కాట్ దొర వస్తాడు. మల్లి అనే చిన్నారిని స్కాట్ దొర భార్య తో తనతో పాటు బలవంతంగా ఢిల్లీకి తీసుకుపోతుంది. ఆ చిన్నారిని తిరిగి తన తండాకు తీసుకొచ్చే బాధ్యతను గోండుల కాపరి భీమ్(ఎన్టీఆర్) చేపడతాడు. ఆ చిన్నారి కోసం ఢిల్లీ వచ్చిన భీమ్‌కు రామ్(రామ్ చరణ్) పరిచయమవుతాడు.
కొద్ది పరిచయంలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు అవుతారు. రామ్ బ్రిటీషర్ల వద్ద పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. మల్లిని విడిపించేందుకు భీమ్ వేసిన ఎత్తును అడ్డుకొని అతడిని అరెస్ట్ చేస్తాడు రామ్. భీమ్‌ను తన చేతులతోనే రామ్ ఉరి తీయాల్సివస్తుంది. అప్పుడు రామ్ ఏం చేశాడు?
బ్రిటీషర్ల వద్ద రామ్ పోలీస్‌గా పనిచేయడానికి కారణమేమిటి? తన తండ్రికి ఇచ్చిన మాటను రామ్ ఎలా నిలబెట్టుకున్నాడు? రామ్‌ను ప్రాణంగా ప్రేమించిన సీత అతడికి ఎందుకు దూరమైంది? రామ్, భీమ్ కలిసి స్కాట్ దొరను ఏ విధంగా ఎదర్కొన్నారన్నదే ఈ మూవీ కథ.
మహేష్ బాబుతో...
ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
టాపిక్