Roshann Upcoming Movie: 'ఛాంపియన్'గా రోషన్.. లుక్‌తో అదరగొట్టిన శ్రీకాంత్ తనయుడు
Roshann Upcoming Movie: పెళ్లి సందడి చిత్రంతో అందర్నీ తనవైపునకు ఆకర్షించిన రోషన్ తదుపరి ప్రాజెక్టు గురించి అప్డేట్ వచ్చింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ అనే మూవీలో అతడు నటిస్తున్నాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
Roshann Upcoming Movie: శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేశాడు. తనదైన ఛార్మింగ్ లుక్, స్టైల్, పర్ఫార్మెన్స్‌తో తొలి సినిమాకే మంచి మార్కులు వేసుకున్న రోషన్ నటించనున్న తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అతడితో పాటు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తుంటే.. రోషన్ మాత్రం తన అప్ కమింగ్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా అతడి తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. వైజయంతీ మూవీస్, స్వప్నా మూవీస్ ప్రొడక్షన్‌లో రోషన్ సినిమా చేయబోతున్నాడు.
నేషనల్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'ఛాంపియన్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రోషన్ మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. సోమవారం రోషన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఈ అప్డేట్ ఇచ్చింది. సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
రోషన్ ఛార్మింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లాంగ్ హెయిర్, గడ్డంతో స్టైలిష్‌గా కనిపించాడు. రోషన్ బెస్ట్ లుక్‌లో ఇదొకటి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్‌ను బట్టి చూస్తుంటేఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. ఇందులో రోషన్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నట్లు సమాచారం.
వైజయంతీ మూవీస్, స్వప్నా మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ డ్రామా, ఎమోషనల్ చిత్రాలకు తనదైన సంగీంతంతో అలరించే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి కెమెరా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం తెలియజేయనుంది.
టాపిక్