Romeo OTT: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘లవ్ గురు’ (Love Guru) పేరుతో వచ్చింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో మంచి అంచనాలతో ఈ చిత్రం వచ్చింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, ఈ రోమియో మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
రోమియో సినిమాను అతిత్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అప్‍డేట్ ఇచ్చింది. ఈ చిత్రం మే 3వ తేదీన తమిళంలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఆహా తమిళ్ ఓటీటీ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అంటే.. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ స్ట్రీమింగ్‍పై ఇంకా అప్‍డేట్ రాలేదు.
Love Guru: రోమియో సినిమా తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ స్ట్రీమింగ్‍పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దగ్గర కూడా ఉన్నాయి. మరి లవ్ గురు సినిమా ఆహాలో వస్తుందా.. ప్రైమ్ వీడియోలో వస్తుందా.. రెండింటిలోనూ అడుగుపెడుతుందా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఆహా అయితే తెలుగు వెర్షన్‍పై ఇంకా ఎలాంటి అప్‍డేట్ ఇవ్వలేదు. లవ్ గురు స్ట్రీమింగ్ గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
రోమియో (లవ్ గురు) సినిమాకు వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. భార్య మనసు గెలిచేందుకు ప్రయత్నించే భర్త పాత్ర చేశారు విజయ్ ఆంటోనీ. ఆయన సరసన ఈ చిత్రంలో మృణాళిని రవి నటించారు. యోగి బాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్, శ్రీజ రవి కీరోల్స్ చేశారు.
తెలుగులోనూ ఈ సినిమా కోసం విజయ్ ఆంటోనీ బాగా ప్రమోషన్లు చేశారు. ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించారు. ప్రీమియర్ షోకు విజయ్ కూడా హాజరయ్యారు. అలాగే, తెలుగులో ప్రెస్‍మీట్ కూడా నిర్వహించారు. అయితే, ఈ మూవీ థియేటర్లలో అంతగా ఆడలేదు. తమిళంలోనూ పెద్దగా వసూళ్లను సాధించలేకపోయింది.
రోమియో సినిమాను మీరా విజయ్ ఆంటోనీ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ సంగీతం అందించారు. ఈ మూవీకి ముందు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎంటర్‌టైనింగ్‍గా ఉన్నా కథ రొటీన్‍గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విజయ్, మృణాళిని పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి.
మలేషియాలో వ్యాపారం చేసే అరవింద్ (విజయ్ ఆంటోనీ) తిరిగి ఇండియాలోని తన సొంత ఊరికి వచ్చేస్తాడు. అక్కడ లీల (మృణాళిని రవి)ని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత అరవింద్, లీల వివాహం జరుగుతుంది. అయితే, ఈ పెళ్లి లీలకు ఇష్టం లేదని అరవింద్‍కు అర్థమవుతుంది. తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు ఈ పెళ్లి చేసుకుందని తెలుసుకుంటాడు. అయితే, లీల మనసు గెలిచేందుకు చాలా ప్రయత్నాలను చేస్తాడు. కాగా, లీల సినిమా హీరోయిన్ కావాలని టార్గెట్ పెట్టుకుంటుంది. మరి చివరికి లీల మనసును అరవింద్ గెలిచాడా? వారిద్దరూ దగ్గరయ్యారా? హీరోయిన్ కావాలన్న లీల కల కూడా నెరవేరిందా? అనేదే రోమియో సినిమాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.