OTT Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-romantic comedy movie ghudchadi to stream directly on jiocinema ott platform plot ott release date hindi movie ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 06, 2024 10:41 PM IST

Ghudchadi OTT: ఘూడ్‍చాడీ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకే రానుంది. సంజయ్ దత్ నటించిన ఈ మూవీ ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమా వస్తోంది.

OTT Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Romantic Comedy: నేరుగా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

హిందీ సినిమా ఘూడ్‍చాడీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా స్ట్రీమింగ్‍కు రానుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి బినోయ్ కే గాంధీ దర్శకత్వం వహించారు. రిలీజ్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకే అడుగుపెట్టనుంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఘూడ్‍చాడీ సినిమా ఆగస్టు 9వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే, హిందీలో ఒక్కటే ఈ మూవీ జియోసినిమాలో స్ట్రీమింగ్‍కు వస్తుందా.. డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయా అనేది చూడాలి.

సెలెబ్రిటీల కోసం ఘూడ్‍చాడీ సినిమా స్క్రీనింగ్‍‍ను మూవీ టీమ్ నేడు నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ స్క్రీనింగ్‍కు బాలీవుడ్ సెలెబ్రెటీలు కొందరు హాజరయ్యారు. జియోసినిమా ఓటీటీలో ఆగస్టు 9 నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

ఘూడ్‍చాడీ సినిమాకు దర్శకుడు బినోయ్ కే గాంధీతో పాటు దీపక్ కపూర్ భరద్వాజ్ కూడా కథను అందించారు. రెండు తరాల జంటల మధ్య ప్రేమ కథతో ఈ మూవీని తెరక్కించారు డైరెక్టర్. ఈ చిత్రానికి తనిష్ బాగ్చీ, సుఖ్‍బీర్, లిజో జార్జ్ - డీజే చీతాస్ మ్యూజిక్ అందించారు.

థియేటర్లకు అనుకొని..

ఘూడ్‍చాడీ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. రెండేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. 2022 నవంబర్‌లోనే చిత్రీకరణ పూర్తయింది. అయితే, థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నించినా ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. జియోసినిమా ఓటీటీకి ఈ చిత్రాన్ని విక్రయించారు. టీ సిరీస్, కీప్ డ్రీమింగ్ పిక్చర్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించాయి.

స్టోరీలైన్.. ట్విస్ట్‌తో..

ఘూడ్‍చాడీ ట్రైలర్ ఇప్పటికే వచ్చేయడంతో స్టోరీ దాదాపు తెలిసిపోయింది. చిరాగ్ (పార్థ్ సమ్తాన్), బేబికా (ఖుశాలీ కుమార్) ప్రేమ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుంది. చిరాగ్, బేబికా ప్రేమలో పడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలకు చెప్పాలని అనుకుంటారు. చిరాగ్ తండ్రి (సంజయ్ దత్), బేబిక తల్లి (రవీనా టాండన్) ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారనే విషయం బయటపడుతుంది. ఈ ట్విస్టుతో చిరాగ్, బేబికా పరిస్థితి గందరగోళంలో పడుతుంది. తల్లిదండ్రుల ప్రేమ గురించి తెలుసుకున్న ఆ ఇద్దరూ ఏం చేశారు? ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఈ మూవీలో చూడాలి. రొమాన్స్, కామెడీ, డ్రామాతో ఈ మూవీ ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

తెలుగులో ‘డ్యూన్ 2’

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్ 2 ఇటీవలే జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఆగస్టు 1న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ ఏడాది మార్చి 1న రిలీజైన డ్యూన్ 2 చిత్రం బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో తిమోతీ షాలమే, జెండాయా ప్రధాన పాత్రలు పోషించారు. డెనిస్ వెల్లేనోవ్ దర్శకత్వం వహించారు.