ఎనీవన్ బట్ యూ సినిమా ఆశ్చర్యపరిచే రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ సాధించింది. సిడ్నీ స్వీనీ, గెన్ పోవెల్ లీడ్ రోల్స్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2023 డిసెంబర్‌లో రిలీజై భారీ హిట్ కొట్టింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే వ్యూస్ దక్కాయి. అయితే, తాజాగా ఓ ఓటీటీలో డిలీటై.. మరో ప్లాట్‍ఫామ్‍లోకి ఈ ఎనీవన్ బట్‍యూ మూవీ ఎంట్రీ ఇచ్చింది.
ఎనీవన్ బట్ యూ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా గతేడాది ఏప్రిల్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చింది. సుమారు ఏడాది పాటు ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ తర్వాత ఇప్పుడు తొలగిపోయింది. వెంటనే సోనీ లివ్ ఓటీటీలోకి ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఎనీవన్ బట్ యూ సినిమా ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో ఇంగ్లిష్‍లో స్ట్రీమ్ అవుతోంది. డీల్ ప్రకారం సంవత్సరం మాత్రమే ఈ మూవీని నెట్‍ఫ్లిక్స్ అందుబాటులో ఉంచింది. గడుపు పూర్తవటంతో తొలగించింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని సోనీలివ్‍లో చూడొచ్చు.
ఎనీవన్ బట్ యూ సినిమా షాకింగ్ వసూళ్లు సాధించింది. అంచనాలకు మించి అప్పట్లో బ్లాక్‍బస్టర్ అయింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం 220 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,878కోట్లు) కలెక్షన్లు సాధించి దుమ్మురేపింది. అప్పట్లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఎనీవన్ బట్ యూ మూవీకి విల్ గ్లక్ దర్శకత్వం వహించారు. సిడ్నీ స్వీనీ, గ్లెన్ పోవెల్‍తో పాటు ఎలెగ్జాండ్రా షిప్, గాటా, హెడ్లీ రాబిన్‍సన్, మిచెల్ హర్డ్, డెర్మోట్ మోల్రోనీ, డారెన్ బార్నెట్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను కోలంబియా పిక్చర్స్, ఆర్కే ఫిల్మ్స్, ఓలివ్ బ్రిడ్జ్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు నిర్మించాయి.
బీ (సీడ్నీ స్వీనీ), బెన్ (గ్లెన్ పోవెల్) డేటింగ్‍కు వెళతారు. తాము మంచి జంట అని డిసైడ్ అయి రిలేషన్ కొనసాగిస్తారు. కొంతకాలానికి అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోతారు. అయితే, వారిద్దరూ ఆస్ట్రేలియాలో జరిగే ఓ పెళ్లికి హాజరవుతారు. ఒకవేళ తాము కపుల్ అయి ఉంటే ఎలా ఉండే వారిమో అని అక్కడ యాక్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ ఎనీవన్ బట్ యూ చిత్రంలో ఉంటుంది. ప్రేమకు రెండో ఛాన్స్ అనేలా ఈ మూవీ సాగుతుంది. కామెడీతో సరదాగా ఉంటుంది.
సంబంధిత కథనం