Telugu News  /  Entertainment  /  Rohit And Merina Kisses Each Other In Front Of Camera In Bigg Boss Season Telugu
రోహిత్-మెరీనా రొమాన్స్
రోహిత్-మెరీనా రొమాన్స్ (Instagram)

Bigg Boss 6 Telugu Episode 10: రోహిత్-మెరీనా రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతున్న నేహా..!

14 September 2022, 11:08 ISTMaragani Govardhan
14 September 2022, 11:08 IST

Rohit kiss with Merina: బిగ్‌బాస్ 6 పదో ఎపిసోడ్2‌లో భార్య, భర్తలైన మెరీనా-రోహిత్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. కెమెరాల ముందే ముద్దులు పెట్టుకోవడం చూసిన నేహాను అక్కడ నుంచి వెళ్లమంటారు. దీంతో నేహా తనకు కూడా పెళ్లి చేసుకోవాలనుందని మనస్సులో మాట బయటకు చెబుతుంది.

Bigg Boss 6 Telugu Episode 10: బిగ్‌బాస్ సీజన్ 6 రోజురోజు గడుస్తున్న కొద్ది ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సారి గొడవలతో పాటు మంచి మసాలా కంటెంట్‌ కూడా బాగా వచ్చేలా ఉంది. ఇప్పటికే భార్య భర్తలైనా రోహిత్-మెరీనాను హౌస్‌లోకి పంపించి ఈ అంశంపై దృష్టి సారించారు బిగ్‌బాస్ నిర్వాహకులు. రోహిత్ తనకు హగ్ ఇవ్వడంలేదని మెరీనా నాగార్జునకు ఫిర్యాదు చేయగా.. బిగ్‌బాస్ మీకు లైసెన్స్ ఇచ్చాడనే ఆయనే చెప్పడంతో ఈ విషయం అర్థమవుతుంది. ఇక తొమ్మిదో రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నామినేషన్స్‌పై ఇంటి సభ్యులు చర్చించారు. దీనిపై ఒకరినొకరు వివరణ ఇచ్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆదిరెడ్డి, గీతూ తమ గేమ్ ప్లాన్ గురించి చర్చించుకున్నారు. నామినేషన్స్ తర్వాత సేవ్ అవ్వడానికి ట్రై చేయడం కంటే.. నామినేషన్స్‌లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సేవ్ చేసుకోవచ్చు తెలుసా? అంటూ ఆదిరెడ్డికి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. నామినేషన్స్‌లో వీక్‌గా ఉన్న కంటెస్టెంట్‌ను నామినేట్ చేస్తే.. వాళ్లు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. రాజశేఖర్, ఇనాయా సుల్తానా లాంటి వాళ్లను నామినేట్ చేస్తే మనం సేవ్ అవుతామని చెప్పింది.

మరోవైపు బాలాదిత్య.. రేవంత్‌కు మరోసారి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. నామినేషన్‌లో అవుతున్నావని, అది తగ్గించుకోవాలని సూచించాడు. ఓ మనిషి నీతో మాట్లాడటానికి వెనుకాడతన్నాడంటే నీ సైడ్ నుంచి ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లే కదా? ఒకరిద్దరూ చెప్తే వాళ్లది తప్పు కావచ్చు. కానీ ఐదారుగురు చెప్పారంటే నీ సైడ్ తప్పు ఉండే అవకాశముంది కదా? చర్చించే కొద్ది నీవు హైపర్ అవుతున్నావ్.. కోపం వస్తుంది.. కాబట్టి చర్చించకు అని రేవంత్‌కు బాలాదిత్య క్లాస్ తీసుకున్నాడు. మరోపక్క ఆరోహి, ఆర్జే సూర్య చర్చించుకుంటూ ఉంటారు. ఆదిరెడ్డి మాట్లాడిన మాటలకు నీకు మాట కూడా రాలేదు చూశావా.. అని ఆరోహి అడగ్గా.. అవును.. ఆ సమయంలో నేను మాట్లాడలేకపోయానని తెలిపింది.

రోహిత్-మెరీనా రొమాన్స్..

మరోపక్క ఉదయాన్నే రోహిత్-మెరీనా ముద్దులతో రెచ్చిపోయారు. బెడ్రూంలో వీరిద్దరూ హద్దులు దాటి మారి ముద్దులు పెట్టుకున్నారు. కెమెరాలు ఉన్నాయని తెలిసినా రొమాన్స్ చేశారు. పక్కనే ఉన్న నేహా ఉన్నప్పటికీ.. చూసింది చాల్లే మేము రొమాన్స్ చేసుకోవాలి.. నువ్వు వెళ్లు అని మెరీనా నేహాతో అంటుంది. దీంతో నేహా.. నాక్కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ అక్కడ నుంచి వెళ్తుంది.

టాస్క్ మొదలైంది..

ఆ తర్వాత రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ప్రారంభమైంది. సిసింద్రీ అనే ఈ టాస్క్‌లో ప్రతి కంటెస్టెంట్‌కు ఓ బేబీ బొమ్మను ఇస్తారు. సభ్యలందరూ తమ బేబీ అలనా, పాలనా, బాగోగులు చూసుకుంటూ.. బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఏ ఐదుగురు సభ్యులైతే.. గార్డెన్ ఏరియాలో ఉన్న బేబీ చైర్‌లో తమ బేబీని ఉంచుతారో వారు బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజెస్‌లో పోరాడటానికి అర్హులవుతారు. ఈ ఛాలెంజ్‌లో నెగ్గిన వారు కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి అర్హత సాధిస్తారు. ఇదే సమయంలో బేబీ బాగోగులు చూసుకోకుండా.. ఒంటరిగా వదిలేస్తే.. వారిని కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి తొలగించడానికి ఆ బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పెట్టవచ్చని బిగ్‌బాస్ ప్రకటిస్తారు.

ఈ టాస్క్‌లో ఆరోహి, చంటి రేవంత్, ఫైమా, గీతూ పాల్గొనగా.. చంటి విజయం సాధిస్తారు. అయితే రేవంత్ తను ఛాలెంజ్‌లో గెలవకుండా ఉండాలని ఫైమా కావాలనే తనకు కావాల్సిన సింబల్‌ను ఇవ్వలకుండా ఆలస్యం చేసిందని ఆరోపిస్తాడు. ఇక్కడ మళ్లీ రేవంత్ హైపర్ అయిపోతాడు. నాతో పోటీ పడటానికి వారి భయం.. ఇలాగే గెలుస్తారు.. గెలవాలి కూడా.. లేకుపోతే వారి వల్ల కాదు అంటూ సీరియస్ అయ్యారు. రేవంత్ ఈ గొడవలో బిజీగా ఉండి తన బొమ్మను కీర్తికి ఇవ్వగా.. కీర్తి వద్ద నుంచి ఆ బొమ్మను గీతూ లాక్కుని లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఉంచి అతడిని కెప్టెన్సీ టాస్క్ ఆడనివ్వకుండా చేస్తుంది. ఆ కాసేపటికే బొమ్మను పక్కనపెట్టుకుని అటు వైపు తిరిగి మాట్లాడుతున్నా అభినయ బొమ్మను కూడా తీసుకుని గీతూ లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఉంచుంది. దీంతో గూతూ కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కు అనర్హురాలు అవుతుంది.

ఈ విధంగా తన బొమ్మను కాపాడుకుంటూ.. పక్కవారి బొమ్మలపై ఫోకస్ పెట్టింది. ఈ టాస్క్ ఉండే కొద్ది రసవత్తరంగా సాగునున్నట్లు తెలుస్తుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత గీతూ.. మరికొంతమంది బొమ్మలను దొంగిలించి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఉంచే అవకాశముంది.