Rocking Rakesh Jordar Sujatha wedding: పెళ్లిపీట‌లెక్కిన జ‌బ‌ర్ధ‌స్త్ జంట - ఫొటోలు వైర‌ల్‌-rocking rakesh jordar sujatha wedding photos viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rocking Rakesh Jordar Sujatha Wedding Photos Viral On Social Media

Rocking Rakesh Jordar Sujatha wedding: పెళ్లిపీట‌లెక్కిన జ‌బ‌ర్ధ‌స్త్ జంట - ఫొటోలు వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2023 12:31 PM IST

Rocking Rakesh Jordar Sujatha wedding: జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ రాకింగ్ రాకేష్, యాంక‌ర్ సుజాత పెళ్లిచేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత
రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత

Rocking Rakesh Jordar Sujatha wedding: జ‌బ‌ర్ధ‌స్త్ జోడీ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లిపీట‌లెక్కారు. చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు.

ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రాకింగ్ రాకేష్‌, జోర్దార్ సుజాత పెళ్లికి జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్స్‌ అంద‌రూ హాజ‌ర‌య్యారు. జ‌బ‌ర్ధ‌స్త్ బ్యాచ్‌తో పాటు ప‌లువురు టీవీ యాక్ట‌ర్స్ పెళ్లికి అటెండ్ అయ్యారు.

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో ద్వారా రాకింగ్ రాకేష్ వెలుగులోకి వ‌చ్చాడు. టీమ్ లీడ‌ర్‌గాను కొన‌సాగుతోన్నాడు. కొన్ని సినిమాల్లో న‌టించాడు. యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది జోర్దార్ సుజాత‌. రాకింగ్ రాకేష్‌తో క‌లిసి జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్‌ల‌లో న‌టించింది. అలా వీరి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. త‌మ ప్రేమ బంధాన్ని గురించి ప‌లుమార్లు ఓపెన్‌గానే వెల్ల‌డిస్తూ వ‌చ్చారు రాకేష్, సుజాత‌.

త‌మ పెళ్లి ప‌నుల‌కు సంబంధించిన ప‌లు వీడియోల్ని సుజాత యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతూ వ‌చ్చింది. ఈ కొత్త జంట‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్