ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం నాలుగు సినిమాలు పోటీపడుతోన్నాయి. అందులో రెండు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కాగా...మరో రెండు డబ్బింగ్ సినిమాలు. నితిన్ రాబిన్‌హుడ్‌తో పాటు నార్నే నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించిన మ్యాడ్ 2 మధ్యే ఎక్కువగా పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలతో పాటు మలయాళ డబ్బింగ్ మూవీ లూసిఫర్ 2తో పాటు తమిళ మూవీ దూన వీర శూరన్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
హిట్టు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తోన్న నితిన్ రాబిన్‌హుడ్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బీష్మ బ్లాక్‌బస్టర్ తర్వాత నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో ఈ మూవీ రాబోతుంది. యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో రాబిన్‌హుడ్ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 27.50 కోట్లకు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నైజాం ఏరియాలో తొమ్మిదిన్నర కోట్లు, ఆంధ్రాలో పది కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. రాబిన్‌హుడ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28.50 కోట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా రాబిన్‌హుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది మ్యాడ్. యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి కొనసాగింపుగా మ్యాడ్ 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌తోపాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ వారం బాక్సాఫీస్ వద్ద రాబిన్‌హుడ్‌కు మ్యాడ్ 2 నుంచి గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్స్‌తో ఈ సీక్వెల్‌పై ఆడియెన్స్‌లో భారీగా క్రేజ్ ఏర్పడింది. మ్యాడ్‌కు మించి కామెడీతో ఈ మూవీ ఉంటుందని మేకర్స్ పేర్కొనడం, వెరైటీ ప్రమోషన్స్ కారణంగా మ్యాడ్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. మ్యాడ్‌కు ఏడింతలు ఎక్కువగా సీక్వెల్ మూవీ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోవం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో 15.50 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలిసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ్యాడ్ 2 రిలీజ్ అవుతోంది. మ్యాడ్ 2 మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తోన్నాడు.
సంబంధిత కథనం