Robinhood Twitter Review: రాబిన్‌హుడ్ ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ మూవీకి ఊహించ‌ని టాక్ - డేవిడ్ వార్న‌ర్ విల‌న్‌-robinhood twitter review nithiin sreeleela movie premieres talk david warner villain in sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Robinhood Twitter Review: రాబిన్‌హుడ్ ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ మూవీకి ఊహించ‌ని టాక్ - డేవిడ్ వార్న‌ర్ విల‌న్‌

Robinhood Twitter Review: రాబిన్‌హుడ్ ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ మూవీకి ఊహించ‌ని టాక్ - డేవిడ్ వార్న‌ర్ విల‌న్‌

Nelki Naresh HT Telugu

Robinhood: భీష్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నితిన్‌, డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల కాంబోలో వ‌చ్చిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ రోల్ చేశాడు. రాబిన్‌హుడ్ మూవీ ప్రీమియ‌ర్ టాక్ ఏంటంటే?

రాబిన్‌హుడ్ ట్విట్టర్ రివ్యూ

నితిన్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా న‌టించిన రాబిన్‌హుడ్ మూవీ మార్చి 28న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. రాబిన్‌హుడ్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

మిక్స్‌డ్ టాక్‌...

రాబిన్‌హుడ్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. హిలేరియ‌స్ కామెడీతో సినిమా న‌వ్వించింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు చెబుతోండ‌గా....మ‌రికొంద‌రు మాత్రం రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఇద‌ని, కొత్త‌గా చెప్పుకోవ‌డానికి సినిమాలో ఏం లేద‌ని ట్వీట్లు పెడుతోన్నారు.

ఎబోవ్ యావ‌రేజ్‌

రాబిన్‌హుడ్ ఎబోవ్ యావ‌రేజ్ మూవీ అని, ఫ‌స్ట్ హాఫ్ బాగుంద‌ని, సెకండాఫ్ మాత్రం ఓకేగా అనిపిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. స్టోరీ బేస్‌డ్ మూవీ కాద‌ని, కామెడీతో ఫ్లోలో అలా వెళ్లిపోతుంద‌ని అన్నాడు. రాబిన్‌హుడ్‌కు సీక్వెల్ కూడా ఉంద‌ని, ఈ సెకండ్ పార్ట్‌లో డేవిడ్ వార్న‌ర్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు క్లైమాక్స్‌లో చూపించ‌డం మాత్రం స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంద‌ని త‌న ట్వీట్‌లో చెప్పాడు.

మ్యూజిక్ మైన‌స్‌...

నితిన్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల‌కిషోర్ కాంబోలో వ‌చ్చే కామెడీ సినిమా మాత్రం బాగా న‌వ్విస్తాయ‌ని చెబుతోన్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారింద‌ని అంటున్నారు. అదిదా స‌ర్‌ప్రైజ్ త‌ప్ప మిగిలిన పాట‌లు ఏవి బాగాలేద‌ని, బీజీఎమ్ కూడా అంతంత మాత్రంగానే ఉంద‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌లో థ్రిల్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని, బోర్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంద‌ని చెబుతున్నారు.

ప్రెడిక్ట‌బుల్‌...

వెంకీ కుడుముల రాసుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం మిస్సయింద‌ని, కామెడీ, ల‌వ్ స్టోరీ, యాక్ష‌న్ ఏది స‌రిగ్గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేద‌ని, స్క్రీన్‌ప్లే కూడా చాలా ప్రెడిక్ట‌బుల్‌గా ఉంద‌ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల క్యారెక్ట‌ర్‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేద‌ని అంటున్నారు.ఆమె క‌నిపించే సీన్స్ మొత్తం క్రింజ్‌లా అనిపిస్తాయ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. నితిన్‌, శ్రీలీల కాంబోలో వ‌చ్చిన సెకండ్ మూవీ ఇద‌ని, గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా చేశారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం