Robinhood First Review: రాబిన్‍హుడ్ సినిమా ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే! వార్నర్ క్యారెక్టర్ ఎంతసేపంటే..-robinhood first review and censor talk nithiin sreeleela david warner comedy movie getting positive internal report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Robinhood First Review: రాబిన్‍హుడ్ సినిమా ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే! వార్నర్ క్యారెక్టర్ ఎంతసేపంటే..

Robinhood First Review: రాబిన్‍హుడ్ సినిమా ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే! వార్నర్ క్యారెక్టర్ ఎంతసేపంటే..

Robinhood First Review: రాబిన్‍హుడ్ సినిమాకు సంబంధించిన ఇంటర్నల్ రిపోర్టులు బయటికి వస్తున్నాయి. సెన్సార్ టాక్ కూడా వచ్చేసింది. ఈ చిత్రంలో ఏవి హైలైట్స్ ఏవో వెల్లడయ్యాయి.

Robinhood First Review: రాబిన్‍హుడ్ ఫస్ట్ రివ్యూ

రాబిన్‍హుడ్ సినిమా విడుదలకు రెడీ అయింది. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ఈ తెలుగు కామెడీ యాక్షన్ మూవీ మరో రెండు రోజుల్లో మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది పండుగ ముందు వచ్చేస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో క్యామియో రోల్ చేయడం మరింత స్పెషల్‍గా ఉంది. రాబిన్‍హుడ్ సినిమాకు అప్పడే ఇంటర్నల్ రిపోర్టులు వచ్చేశాయి. ఈ చిత్రానికి టాక్ ఎలా ఉందంటే..

ఫస్ట్, సెకండ్ హాఫ్‍లు ఇలా..

రాబిన్‍హుడ్ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయింది. దీంతో ఈ మూవీ ఎలా ఉందో సెన్సార్ టాక్ బయటికి వచ్చింది. అలాగే ఇంటర్నల్ టాక్ కూడా వినిపిస్తోంది. రాబిన్‍హుడ్ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉందని తెలుస్తోంది. కామెడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయనే టాక్ నడుస్తోంది. వెంకీ కుడుముల మార్క్ సరదా సన్నివేశలు ఆకట్టుకునేలా ఉన్నాయట.

నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌ మధ్య ఉండే కామెడీ సీన్లు రాబిన్‍హుడ్ చిత్రంలో బాగా వర్కౌట్ అయ్యాయని ఇంటర్నల్ టాక్. ఫస్టాఫ్ మొత్తం సరదాగా ఎక్కువ శాతం కామెడీ సీన్లతో సాగుతుందని తెలుస్తోంది.

హైలెట్స్ ఇవే

ఈ చిత్రంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందని, ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని టాక్. ఇదే హైలైట్‍గా ఉంటుందని అంచనాలు సమాచారం. సెకండాఫ్‍లో కామెడీతో పాటు ఎమోషన్లు, యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

మొత్తంగా రాబిన్‍హుడ్ చిత్రానికి ప్రస్తుతం పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ మూవీకి కామెడీ సీన్లు, ఇంటర్వెల్, స్క్రీన్‍ప్లే, నితిన్ పర్ఫార్మెన్స్, ప్రీక్రైమాక్స్, డేవిడ్ వార్నర్ క్యామియో హైలైట్‍గా ఉంటాయని టాక్. మరి సినిమా రిలీజయ్యాక ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

వార్నర్ క్యామియో ఎంతసేపు!

రాబిన్‍హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ సుమారు 3 నిమిషాల పాటు కనిపిస్తారట. ఈ క్యామియో రోల్ అదిరిపోతుందని, ఎఫెక్టివ్‍గా ఉంటుందని టాక్. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లోనూ వార్నర్ పాల్గొన్నారు. నితిన్, లీలతో కొన్ని రీల్స్ కూడా చేశారు. వార్నర్ వల్ల ఈ చిత్రానికి మరింత ఎక్కువ బజ్ వస్తోంది.

రాబిన్‍హుడ్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు వచ్చిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ట్రైలర్లో బీజీఎం కూడా మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.

రాబిన్‍హుడ్ చిత్రంపై మూవీ టీమ్ బలమైన నమ్మకంతో ఉంది. నితిన్‍కు ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుందని డైరెక్టర్ వెంకీ ఇటీవలే చెప్పారు. నితిన్, శ్రీలీల కూడా ఈ చిత్రం పక్కా హిట్ అవుతోందని చాలాసార్లు అంటున్నారు. ప్రమోషన్లను మూవీ టీమ్ ఓ రేంజ్‍లో చేస్తోంది. పాడుకాస్ట్ అంటూ నితిన్, లీల, వెంకీ చేసిన వీడియోలు బాగా నవ్వించాయి. వరుసగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ జజ్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో నితిన్ - వెంకీ కాంబోలో భీష్మ బ్లాక్‍బస్టర్ అయింది. వారి కాంబో రిపీట్ అయిన రాబిన్‍హుడ్ కూడా మేజిక్ చేస్తుందని మూవీ టీమ్ గట్టిగా నమ్ముతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం