OTT:ఈ శుక్రవారం (నేడు) నితిన్ రాబిన్‌హుడ్‌తో పాటు మ్యాడ్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు కామెడీ కథాంశాలతోనే తెరకెక్కడం గమనార్హం. కాగా రాబిన్‌హుడ్‌తో పాటు మ్యాడ్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఫిక్సయ్యాయి.
నితిన్ రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. రాబిన్‌హుడ్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. కేతికా శర్మ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
రాబిన్‌హుడ్ ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వచ్చింది. కథను కాకుండా కామెడీని నమ్మి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడంటూ నెటిజన్లు పేర్కొన్నాయి. కామెడీ కూడా ఫోర్స్‌డ్‌గా ఉందంటూ కామెంట్స్ చేశారు. పాటలు ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయని చెబుతోన్నారు.
గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో రాబిన్‌హుడ్‌పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. వెరైటీ ప్రమోషన్స్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైనట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా రాబిన్‌హుడ్ మూవీ 800 థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండున్నర కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.
మ్యాడ్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఈ సినిమా మే ఫస్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మ్యాడ్ 2 మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
మ్యాడ్ 2 మూవీ రాబిన్‌హుడ్ కంటే ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు కోట్ల వరకు జరిగాయి. ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ మ్యాడ్ 2కు ప్లస్సయింది. ఈ సినిమా ఫస్ట్ డే నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
సంబంధిత కథనం