దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు.. అది వాళ్లను అవమానించడమే అవుతుంది: ప్రేక్షకులకు కాంతార మేకర్స్ రిక్వెస్ట్-rishabh shetty kantara chapter 1 makers urge public and audience not to imitate daiva characters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు.. అది వాళ్లను అవమానించడమే అవుతుంది: ప్రేక్షకులకు కాంతార మేకర్స్ రిక్వెస్ట్

దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు.. అది వాళ్లను అవమానించడమే అవుతుంది: ప్రేక్షకులకు కాంతార మేకర్స్ రిక్వెస్ట్

Hari Prasad S HT Telugu

కాంతార ఛాప్టర్ 1 మేకర్స్ సాధారణ జనంతోపాటు ప్రేక్షకులు, అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. సినిమాలోని దైవ పాత్రలను పబ్లిగ్గా ప్రదర్శించవద్దని వాళ్లు కోరారు. మంగళవారం (అక్టోబర్ 7) వాళ్లు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు.. అది వాళ్లను అవమానించడమే అవుతుంది: ప్రేక్షకులకు కాంతార మేకర్స్ రిక్వెస్ట్

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన అద్భుతం 'కాంతార ఛాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అటు సోషల్ మీడియా అంతటా అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉంది. అయితే కొద్ది రోజుల కిందట దైవం వేషధారణలో ఉన్న ఒక అభిమాని తమిళనాడు థియేటర్‌లోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. మరికొందరు అభిమానులు థియేటర్ వెలుపల సినిమాలోని ఒక సన్నివేశాన్ని ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 7) నాడు హోంబలే ఫిల్మ్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సినిమాలో చూపించిన దైవాల పాత్రలను అనుకరించడం లేదా కాజువల్‌గా మిమిక్రీ చేయవద్దని, అవి 'ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు' అని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

'కాంతార ఛాప్టర్ 1' మేకర్స్ అధికారిక ప్రకటన

కాంతార ఛాప్టర్ 1 థియేటర్లలో దూసుకెళ్తున్న సమయంలో హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన జారీ చేసింది. "సినిమా ప్రియులకు, గ్లోబల్ ప్రేక్షకులకు.. దైవారాధన అనేది కర్ణాటకలోని తీర ప్రాంతమైన తుళునాడు లోని విశ్వాసానికి, సాంస్కృతిక గౌరవానికి లోతైన చిహ్నంగా నిలుస్తుంది.

మా సినిమాలు 'కాంతార' ‘కాంతార ఛాప్టర్-1’ ఈ భక్తిని గౌరవప్రదంగా చిత్రీకరించడానికి, దైవాల మహిమను చూపించడానికి రూపొందించాం. దైవారాధనపై ఉన్న లోతైన గౌరవం, అచంచలమైన భక్తిని గౌరవించాలని మేము ప్రయత్నించాం. తద్వారా తుళు మట్టి ప్రాముఖ్యత, వారసత్వాన్ని ప్రపంచానికి విజయవంతంగా వ్యాప్తి చేశాం" అని చెప్పారు.

పబ్లిగ్గా ఆ పని చేయొద్దు

అదే ప్రకటనలో హోంబలే ఫిల్మ్స్ కీలకమైన సూచన అభిమానులకు జారీ చేసింది. "ఈ సినిమాకు వస్తున్న సానుకూల స్పందనకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే కొంతమంది వ్యక్తులు సినిమాలోని దైవాల పాత్రలను అనుకరిస్తూ.. పబ్లిక్ ప్రదేశాలలో, సమావేశాలలో అనుచితంగా ప్రవర్తించడాన్ని మేము గమనించాము.

మా సినిమాలో చూపించిన దైవారాధన లేదా దైవ పూజ అనేది లోతైన ఆధ్యాత్మిక సంప్రదాయంలో పాతుకుపోయింది. ఇది ప్రదర్శన కోసం లేదా సాధారణ అనుకరణ కోసం ఉద్దేశించినది కాదు. ఇటువంటి చర్యలు మా విశ్వాసాన్ని తక్కువ చేయడం అవుతుంది. ఇది తుళు కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

అందువల్ల ప్రజలు, ప్రేక్షకులు ఈ దైవ పాత్రలను అనుకరించడం, మిమిక్రీ చేయడం, లేదా తక్కువ చేసి చూపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హోంబలే ఫిల్మ్స్ విజ్ఞప్తి చేస్తోంది. అది సినిమా హాళ్లలో అయినా లేదా బహిరంగ ప్రదేశాలలో అయినా. దైవారాధన పవిత్ర స్వభావం ఎల్లప్పుడూ నిలవాలి. ఈ సినిమాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము పౌరులందరినీ కోరుతున్నాము" అని స్పష్టం చేసింది.

'కాంతార ఛాప్టర్ 1' గురించి..

కర్ణాటకలోని కదంబ రాజవంశం సమయంలో జరిగిన కథతో 'కాంతార ఛాప్టర్ 1' వచ్చింది. ఇది ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ ఇంగ్లీష్ తో సహా అనేక భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. ఇది అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం