కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: రిషబ్ శెట్టి హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మరో సినిమా కాంతార చాప్టర్ 1. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన కాంతార 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
దసరా రోజున బంపర్ ఓపెనింగ్ తరువాత రెండో రోజు మందగించిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ మూడో రోజు పెరిగాయి. ముూడో రోజున అంటే శనివారం (అక్టోబర్ 4) నాడు ఇండియాలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 55 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి.
అంటే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు సుమారుగా 15 శాతం వరకు కలెక్షన్స్ పెరిగాయి. అలాగే, మూడు రోజుల్లో ఇండియాలో కాంతార 2 సినిమాకు రూ. 162.85 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, రూ. 195.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.
ఆదివారం కలెక్షన్స్ ముగిసేసరికి కాంతారా 2 చిత్రం రూ. 200 కోట్ల దేశీయ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కన్నడ వెర్షన్‌లో మూడో రోజు ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొత్తంగా 94 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
హిందీ బెల్ట్ నుంచి కూడా కాంతార 2 మూవీకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పటికీ ఇండియాలో హిందీ ద్వారా రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. అలాగే, ఓవర్సీస్‌లో మూడు రోజుల్లో కాంతార చాప్టర్ 1 చిత్రానికి 3 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.
ట్రేడ్ నిపుణుల ప్రకారం కాంతార చాప్టర్ 1 మూవీకి మూడు రోజుల్లో రూ. 225 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ సల్మాన్ ఖాన్ సికందర్ (రూ. 176 కోట్లు), రామ్ చరణ్ గేమ్ చేంజర్ (రూ. 200 కోట్లు), సంజయ్ లీలా భన్సాలీ-అలియా భట్‌ల గంగూబాయి కతియావాడి (రూ. 210 కోట్లు) వంటి 3 సినిమాలతో సహా ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది.
ఇక ఇప్పుడు కాంతార 2 మూవీ రూ. 250 కోట్ల మార్క్ వైపుకు దూసుకుపోతోంది. ఈ టార్గెట్‌ను ఆదివారం మధ్యాహ్నం నాటికి సులభంగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం