కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 11: రిషబ్ శెట్టి నటించిన శాండల్ వుడ్ చిత్రం కాంతార చాప్టర్ 1 రెండో వీకెండ్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. శనివారం (అక్టోబర్ 11) రూ. 39 కోట్లతో అద్భుతమైన నెట్ కలెక్షన్స్ సాధించింది కాంతార 2 సినిమా.
తొమ్మిదో రోజుతో పోలిస్తే పదో రోజున ఏకంగా 75.28 శాతం పెరిగాయి కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్. అలాగే, 11వ రోజు అయిన ఆదివారం కూడా కలెక్షన్లతో జోరు చూపించింది ఈ కన్నడ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. రెండో ఆదివారం నాడు ఇండియాలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.
ఈ 40 కోట్ల నెట్ కలెక్షన్స్‌లో కన్నడ నుంచి రూ. 12.3 కోట్లు, తెలుగు ద్వారా 4.8 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి 14.25 కోట్లు, తమిళంలో 5.25 కోట్లు, మలయాళం నుంచి 3.4 కోట్లుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కన్నడ కంటే ఎక్కువగా హిందీ బెల్ట్ ద్వారానే కాంతార చాప్టర్ 1 సినిమాకు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి.
ఇక పదో రోజుతో పోలిస్తే 11వ రోజున కాంతార చాప్టర్ 1 సినిమాకు 2.56 శాతం కలెక్షన్స్ పెరిగిపోయాయి. ఇలా 11 రోజుల్లో భారతదేశంలో కాంతార ప్రీక్వెల్ మూవీకి రూ. 438.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం. ఇక పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 560 కోట్లు రాబట్టిన ఈ సినిమా 11 రోజుల్లో సుమారుగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో 2025లో అత్యధికంగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన రెండో సినిమా సయ్యారాను బీట్ చేసింది కాంతార చాప్టర్ 1. సయ్యారా మూవీకి రూ. 579.23 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో రష్మిక మందన్నా ఛావా (రూ. 797.34) తర్వాత రెండో స్థానంలో సయ్యారా నిలిచింది.
ఇప్పుడు సయ్యారా రికార్డ్‌ను బ్రేక్ చేసిన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ మూవీ ఛావా రికార్డ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. సయ్యారా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను 11 రోజుల్లోనే కాంతార 2 దాటేసి రికార్డ్ కొట్టింది.
సంబంధిత కథనం