Rifle Club OTT Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్
Rifle Club OTT Streaming: మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైఫిల్ క్లబ్ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Rifle Club OTT Streaming: ఓటీటీలోకి నెల రోజుల్లోపే మరో మలయాళం హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆశిఖ్ అబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మలయాళం సినిమాలో అరంగేట్రం చేశాడు. బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్లు వసూలు చేసిన ఈ హిట్ మూవీ.. డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కాగా.. అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టింది.

రైఫిల్ క్లబ్ ఓటీటీ స్ట్రీమింగ్
రైఫిల్ క్లబ్ మూవీ గురువారం (జనవరి 16) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది డిసెంబర్ 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది.
ఈ రైఫిల్ క్లబ్ మూవీకి శ్యామ్ పుష్కరన్, దిలీష్ కరుణాకరణ్, సుహాస్ కథ అందించారు. అనురాగ్ కశ్యప్ తోపాటు విజయ రాఘవన్, దర్శన రాజేంద్రన్, దిలీష్ పోతన్, వాణి విశ్వనాథ్, సురేష్ కృష్ణ, వినీత్ కుమార్ లాంటి వాళ్లు నటించారు.
రైఫిల్ క్లబ్ మూవీ స్టోరీ ఇదీ
కేరళలోని వయనాడ్ లో జరిగిన స్టోరీగా ఈ రైఫిల్ క్లబ్ ను తెరకెక్కించారు. ఈ మూవీ రెండు గ్రూపుల మధ్య జరిగే గన్ ఫైట్. ఓ ఆయుధాల డీలర్ల గ్యాంగ్, వయనాడ్ లోని షూటింగ్ క్లబ్ సభ్యుల మధ్య వార్ నడుస్తుంది. ఓ ఆయుధ డీలర్ కొడుకు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులు.. రైఫిల్ క్లబ్ లో ఆశ్రయం పొందుతారు.
ఆ విషయం తెలుసుకున్న ఆ గ్యాంగ్.. వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. రైఫిల్ క్లబ్ వాళ్లకు అండగా నిలుస్తుంది. ఈ మూవీ ద్వారా మలయాళం సినిమాలో అడుగుపెట్టిన అనురాగ్ కశ్యప్.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి మూవీ హిందీలో రాదని అన్నాడు. గతంలో మహారాజా మూవీ ద్వారా తమిళంలోకీ వచ్చిన అతడు.. ఇక సౌత్ మూవీస్ లోనే నటించడానికి ముంబై, బాలీవుడ్ ను వదిలేయనున్నట్లు ఆ మధ్య చెప్పాడు.