Richest Bollywood Kapoor Heroine Net Worth 550 Cr: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి మంచి పేరు తెచ్చుకున్న కుంటుంబాల్లో కపూర్ ఫ్యామిలీ ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఈ కుటుంబ సభ్యులు బాలీవుడ్‌ను ఏలారు. బ్లాక్ బస్టర్స్ హిట్స్, విమర్శకుల ప్రశంసలు పొందిన మాస్టర్ పీస్ సినిమాలను కపూర్ ఫ్యామిలీ అందించింది.
దీంతో కపూర్ కుటుంబ సభ్యులు, కపూర్ ఫ్యామిలీ అత్యంత ధనవంతులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ కపూర్ ఫ్యామిలీలో ఒకరు రూ. 550 కోట్ల విలువైన ఆస్తులను కలిగి అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. వాళ్లు సీనియర్ హీరోయిన్స్ అయిన కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణ్‌బీర్ కపూర్ ఎవరు కాదు. ఆమె మరెవెరో కాదు బ్యూటిఫుల్ అండ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ కపూర్.
భట్ ఫ్యామిలీకి చెందిన అలియా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఒక సభ్యురాలు అయింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత ధనవంతురాలైన కపూర్‌గా నిలిచింది. ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో తనను తాను అలియా భట్ కపూర్‌గా పేర్కొన్న ఈ ముద్దుగుమ్మ జీక్యూ ప్రకారం, సుమారుగా 550 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కలిగి ఉందట.
ఈ ఆస్తులు అలియా భట్ కపూర్‌ను భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటీమణులలో ఒకరిగా, ఆమె సమకాలీనుల కంటే, సీనియర్ల కంటే అగ్ర స్థానంలో నిలబెట్టినట్లు జీక్యూ పేర్కొంది. ఇక అలియాకు వదిన వరస అయ్యే బాలీవుడ్ బెబో కరీనా కపూర్ రూ. 500 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉందని సమాచారం.
అలాగే, అలియా భర్త రణ్‌బీర్ కపూర్ 345 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో టాప్ 3 నెంబర్‌తో కపూర్ కుటుంబంలో చివరి స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా, పలు నివేదికల ప్రకారం, అలియా భట్ ఒక సినిమాకు రూ. 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందట. అలాగే, ప్రతి ఎండార్స్‌మెంట్‌కు రూ. 9 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం.
అలియా భట్ వరుస సినిమాలతో పాటు అనేక బ్రాండ్లతో భారీ సంపదను పెంచుకుందని తెలుస్తోంది. అయితే, అలియా భట్ కపూర్ అత్యంత ధనవంతురాలు కావడానికి ప్రధాన కారణం ఆమె వ్యాపారవేత్తగా మారడమే అని సమాచారం. ఆలియాకు ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) అనే దుస్తుల బ్రాండ్ ఉంది.
2023లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL) బ్రాండ్‌లో 51% వాటాను సొంతం చేసుకుంది అలియా భట్. అప్పుడు ఈ బ్రాండ్ విలువ 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని నివేదికలు తెలిపాయి. ఇక ఇటీవలి నివేదికల ప్రకారం ఈ బ్రాండ్ విలువ మరింత ఎక్కువగా సుమారు 300 కోట్ల రూపాయలుగా అంచనా వేశాయి. కానీ, దీనిని నిర్ధారించే డేటా మాత్రం లేదు.
కాగా అలియా భట్ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం
టాపిక్