Richest Actor in India: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్-richest actors in india shah rukh khan top the list allu arjun prabhas rajinikanth in the list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Richest Actor In India: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్

Richest Actor in India: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్

Hari Prasad S HT Telugu
Jun 18, 2024 04:25 PM IST

Richest Actor in India: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? బాలీవుడ్ డామినేట్ చేసే మన దేశంలో ఇప్పుడిప్పుడే సౌత్ స్టార్లు కూడా వందల కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటున్న వేళ ఒకసారి టాప్ 10 లిస్టులో ఎవరున్నారో చూద్దాం.

ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్
ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ వీళ్లే.. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్ (PTI)

Richest Actor in India: ఇండియాలో అత్యధికంగా సంపాదిస్తున్న, ఇప్పటికే అత్యధిక సంపద ఉన్న యాక్టర్స్ జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఐఎండీబీ డేటాను ఆధారంగా చేసుకొని టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితా తయారు చేసింది. ఇందులో షారుక్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. అల్లు అర్జున్, ప్రభాస్, రజనీకాంత్ లాంటి సౌత్ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.

ఇండియాలో అత్యధిక సంపద ఉన్న స్టార్లు

ఇండియన్ సినిమాలో కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ దే రాజ్యం. హిందీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో ఎక్కడికెళ్లినా ఆ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే మొదటి నుంచీ ఆ ఇండస్ట్రీ స్టార్లదే హవా. తాజా జాబితాలోనూ వాళ్లే టాప్ లో ఉన్నా.. అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి సౌత్ స్టార్లు కూడా దీటుగా నిలిచారు. ఈ జాబితాలో షారుక్ తొలి స్థానంలో ఉన్నాడు.

షారుక్ ఖాన్ సంపద: సుమారు రూ.6300 కోట్లు

ఇండియాలో అత్యధిక సంపద కలిగిన నటుడు షారుక్ ఖానే. దేశంలో ఒక్కో సినిమాకు అత్యధిక మొత్తం అందుకునే స్టార్ కూడా అయిన షారుక్ సంపద సుమారు రూ.6300 కోట్లు కావడం విశేషం. అతని దరిదాపుల్లోనూ ఎవరూ లేరు.

సల్మాన్ ఖాన్: రూ.2900 కోట్లు

మూడు దశాబ్దాలకుపైగా బాలీవుడ్ ను ఏలుతున్న మరో నటుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని సంపద విలువ సుమారు రూ.2900 కోట్లుగా అంచనా వేశారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అతడు.

అక్షయ్ కుమార్ : రూ.2500 కోట్లు

మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంపద రూ.2500 కోట్లు. యాక్షన్ హీరోగా ఇమేజ్ సంపాదించిన అతడు.. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినా.. సంపద విషయంలో మాత్రం ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆమిర్ ఖాన్: సుమారు రూ.1862 కోట్లు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని సంపద విలువ రూ.1862 కోట్లు. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ మూవీ కూడా అతనిదే.

దళపతి విజయ్: సుమారు రూ.474 కోట్లు

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రూ.474 కోట్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నాడు. త్వరలోనే సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్తున్న ఈ స్టార్ హీరోకు తమిళనాడులో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

రజనీకాంత్: సుమారు రూ.430 కోట్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంపద విలువను సుమారు రూ.430 కోట్లుగా అంచనా వేశారు. ఈ మధ్యే జైలర్ సినిమాతోనే అతడు రూ.110 కోట్లు అందుకున్నాడు.

అల్లు అర్జున్: సుమారు రూ.350 కోట్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపద విలువను సుమారు రూ.350 కోట్లుగా లెక్కగట్టారు. పుష్ప 2తో మరోసారి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటబోతున్న బన్నీ.. తన సంపదను మరింత పెంచుకోబోతున్నాడు.

ప్రభాస్: సుమారు రూ.241 కోట్లు

ప్రభాస్ సంపద విలువను సుమారు రూ.241 కోట్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అతడు.. త్వరలోనే కల్కి 2898 ఏడీతో రాబోతున్నాడు.

అత్యధిక రెమ్యునరేషన్ హీరోలు వీళ్లే

ఒక్కో సినిమాకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లోనూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖానే తొలి స్థానంలో ఉన్నాడు. అతడు ఒక్కో సినిమాకు సుమారు రూ.150 కోట్ల నుంచి రూ. 250 కోట్లు తీసుకుంటాడు.

ఇక తర్వాతి స్థానాల్లో రజనీకాంత్ (రూ.150 కోట్ల నుంచి రూ.210 కోట్లు), దళపతి విజయ్ (రూ.130 కోట్ల నుంచి రూ.200 కోట్లు), ప్రభాస్ (రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లు), ఆమిర్ ఖాన్ (రూ.100 కోట్ల నుంచి రూ.175 కోట్లు, సల్మాన్ ఖాన్ (రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు), కమల్ హాసన్ (రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు), అల్లు అర్జున్ (రూ.100 కోట్ల నుంచి రూ.125 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.60 కోట్ల నుంచి రూ.145 కోట్లు), అజిత్ కుమార్ (రూ.105 కోట్లు) ఉన్నారు.

WhatsApp channel