RGV Den: ఆసక్తికరంగా ఆర్జీవీ కొత్త ఆఫీస్ ‘డెన్’.. వీడియో విడుదల చేసిన డైరెక్టర్.. ఎంట్రెన్స్‌ వద్ద ఏ ఫొటోలు ఉన్నాయంటే!-rgv shared his den office tour video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Den: ఆసక్తికరంగా ఆర్జీవీ కొత్త ఆఫీస్ ‘డెన్’.. వీడియో విడుదల చేసిన డైరెక్టర్.. ఎంట్రెన్స్‌ వద్ద ఏ ఫొటోలు ఉన్నాయంటే!

RGV Den: ఆసక్తికరంగా ఆర్జీవీ కొత్త ఆఫీస్ ‘డెన్’.. వీడియో విడుదల చేసిన డైరెక్టర్.. ఎంట్రెన్స్‌ వద్ద ఏ ఫొటోలు ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 11, 2023 03:12 PM IST

RGV Office Den: తన ఆఫీస్ డెన్ ఎలా ఉందో వీడియోను పోస్ట్ చేశాడు దర్శకుడు ఆర్జీవీ. ఈ ఆఫీస్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

RGV Den: ఆసక్తికరంగా ఆర్జీవీ కొత్త ఆఫీస్ ‘డెన్’.. వీడియో విడుదల చేసిన డైరెక్టర్ (Photo: RGV)
RGV Den: ఆసక్తికరంగా ఆర్జీవీ కొత్త ఆఫీస్ ‘డెన్’.. వీడియో విడుదల చేసిన డైరెక్టర్ (Photo: RGV)

RGV Office Den: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం ఏది చేసినా సంచలనమే. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‍లో.. ఆ తర్వాత బాలీవుడ్‍లో టాప్ దర్శకుల్లో ఒకడిగా.. వైవిధ్యమైన ఫిల్మ్ మేకర్‌గా వెలుగొందిన ఆర్జీవీ ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కథాంశంగా ప్రస్తుతం ‘వ్యూహం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఆర్జీవీ హైదరాబాద్‍లో కొత్త ఆఫీస్‍ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి డెన్ అని పేరు పెట్టాడు. ఈ ఆఫీస్ వీడియోను ఆఫీస్ టూర్ అంటూ పోస్ట్ చేశాడు ఆర్జీవీ.

హైదరాబాద్‍లో ఓ బిల్డింగ్ మొత్తాన్ని ఆర్జీవీ తన ఆఫీస్‍గా చేసుకున్నాడు. దీనికి డెన్ అని పేరు పెట్టాడు. ఈ ఆఫీస్ బిల్డింగ్‍కు ముందు భాగంలో ఆర్జీవీ కుర్చీలో కూర్చొని ఉన్న ఫొటో పెద్దగా ఉంది. ఇక ఆఫీస్ ఎంట్రన్స్ వద్ద.. సర్కార్ చిత్రం సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‍తో కలిసి దిగిన ఫొటో ఒకవైపు ఉంది. మరో సైడ్ హీరో నాగార్జునతో తాను ఉన్న ఫొటోను ఆర్జీవీ ఏర్పాటు చేసుకున్నాడు. తాను పని చేసిన నటీనటులతో పాటు తన జీవితంలో ముఖ్యమైన సందర్భాల ఫొటోలు గ్రౌండ్ ఫ్లోర్ స్టార్టింగ్‍లో ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్రెస్టింగ్ క్వైట్స్ ఏర్పాటు చేయించుకున్నాడు ఆర్జీవీ.

పచ్చదనంతో..

ఆర్జీవీ డెన్‍లో చాలా చోట్ల హీరోయిన్ల ఫొటోలు పెద్దపెద్దగా ఉన్నాయి. అయితే, ఈ ఆఫీస్‍లో చాలా చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. ఆఫీస్‍ను చాలా శాతం పచ్చదనంతో నింపేశాడు ఆర్జీవీ. చాలా చోట్ల ఈ ఆఫీస్ పార్కులా కనిపిస్తోంది. మొత్తంగా ఆర్జీవీ ఆఫీస్ ‘డెన్’ ఇంటీరియర్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది.

ఇదే ఫిలాసఫీ

ఫౌంటేన్‍హెడ్ బుక్‍లో ప్రముఖ రచయిత ఐన్ రాండ్ ఫిలాసఫీ స్ఫూర్తిగా ఈ ఆఫీస్‍ను డిజైన్ చేసుకున్నట్టు ఆర్జీవీ తెలిపాడు. “కార్యాలయాన్ని నడిపించే వ్యక్తి ఆలోచనలను ఆఫీస్ ఇంటీరియర్ ప్రతిబించించాలి (రిఫ్లెక్ట్)” అనే ఫిలాసఫీతో తన ఆఫీస్‍ను ఆర్జీవీ డిజైన్ చేయించుకున్నాడు. ఈ ‘డెన్’ వీడియోకు మంచి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Whats_app_banner