RGV on Shraddha Walker murder: శ్రద్ధా దెయ్యంలా వచ్చి అతన్ని 70 ముక్కలు చేయాలి: ఆర్జీవీ
RGV on Shraddha Walker murder: శ్రద్ధా దెయ్యంలా వచ్చి తనను చంపిన వాడిని 70 ముక్కలు చేయాలంటూ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ మర్డర్ కేసుపై రాంగోపాల్ వర్మ బుధవారం (నవంబర్ 16) కొన్ని ట్వీట్లు చేశాడు.
RGV on Shraddha Walker murder: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఆమె లివ్-ఇన్ పార్ట్‌నర్ అయిన అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి శ్రద్ధాను దారుణంగా హతమార్చి 35 ముక్కలుగా చేసి ఢిల్లీ అంతటి విసిరాడన్న వార్తే భయానకంగా ఉంది. ఇప్పటికే ఆమెకు సంబంధించినవిగా చెబుతున్న 10-13 ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
ట్రెండింగ్ వార్తలు
వాటిని సమీపంలోని అడవిలో గుర్తించారు. ఇప్పటికే ఆమె తండ్రి డీఎన్‌ఏ నమూనాలను కూడా సేకరించి వీటితో సరిపోల్చనున్నారు. అయితే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో తాజాగా ఫిల్మ్ డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడు. తన ట్విటర్ అకౌంట్‌లో తనదైన రీతిలో ఆర్జీవీ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
"ఆమె చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండటం కంటే దెయ్యంలా తిరిగి వచ్చి అతన్ని 70 ముక్కలు చేయాలి" అని మొదట ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇదే శ్రద్ధా మర్డర్‌పై మరో ట్వీట్ చేశాడు. "చట్టంతో భయపెట్టి ఇలాంటి దారుణమైన హత్యలను ఆపలేము. కానీ చనిపోయిన వాళ్లు దెయ్యంలా తిరిగి వచ్చి తమను చంపిన వాళ్లను చంపితే మాత్రం ఆపవచ్చు. ఈ విషయాన్ని దేవుడు పరిశీలించాలని కోరుకుంటున్నాను" అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
ఇలా దెయ్యాలు, భూతాలపై రాంగోపాల్ వర్మ కూడా చాలా సినిమాలే తీసిన విషయం తెలిసిందే. రాత్రి, దెయ్యం, భూత్‌లాంటి మూవీ ఆర్జీవీ మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అతడు ఈ శ్రద్ధా మర్డర్ విషయంలోనూ అదే స్టైల్లో స్పందించాడు. ఈ హత్య విషయంలో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధానిలో మరోసారి మహిళల భద్రత గురించి చర్చ జరుగుతోంది.
శ్రద్ధను ఇంత క్రూరంగా హత్య చేసిన అఫ్తాబ్‌ను పబ్లిగ్గా ఉరి తీయాలంటే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేయడం గమనార్హం. అలా చేస్తేనే మహిళల పట్ల జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.