Revu Movie: మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించే సినిమా రేవు.. ఎమోషనలైన విలన్.. స్పీచ్ వైరల్-revu movie title announcement on fisherman struggles and senior journalist prabhu actor hemanth speech tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Revu Movie: మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించే సినిమా రేవు.. ఎమోషనలైన విలన్.. స్పీచ్ వైరల్

Revu Movie: మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించే సినిమా రేవు.. ఎమోషనలైన విలన్.. స్పీచ్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Jun 14, 2024 02:25 PM IST

Revu Movie Title Announcement: మత్స్యకారుల జీవిత చిత్రాన్ని, వారి జీవితంలోని సంఘర్షణను ఆవిష్కరించే సినిమాగా వస్తోంది రేవు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రేవు టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించే సినిమా రేవు.. ఎమోషనలైన విలన్.. స్పీచ్ వైరల్
మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించే సినిమా రేవు.. ఎమోషనలైన విలన్.. స్పీచ్ వైరల్

Revu Movie Title Launch: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.

హరినాథ్ పులి ఈ రేవు చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అ‌వుతోంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర వివరాలతోపాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

"ముందుగా మా మిత్రుడు పర్వతనేని రాంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. నేను గుంటూరులో ఉండగా ఒక వ్యక్తి రేవు సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ చూపించాడు. పుటేజ్ ఆసక్తికరంగా అనిపించింది. నేను హైదరాబాద్ వచ్చాక మా మిత్రుడు పర్వతనేని రాంబాబుతో రేవు మూవీ గురించి మాట్లాడాను. రాంబాబు తన మిత్రుడు, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారితో మాట్లాడారు. మా మీద నమ్మకంతో మురళీ గింజుపల్లి గారు మీరు ప్రొసీడ్ అవ్వండని చెప్పారు" అని సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తెలిపారు.

"ఆయన యూఎస్ నుంచి వచ్చిన తర్వాత రేవు సినిమా ఫస్ట్ కాపీ చూపించాం. డాక్టర్ మురళీ గింజుపల్లి హ్యాపీగా ఫీలయ్యారు. సముద్రతీర ప్రాంతంలో చేపలు పట్టడమే జీవనాధారంగా బతికే మత్స్యకారుల జీవితాల్లోని సంఘర్షణ చూపించే చిత్రమిది. చాలా సహజంగా సినిమా సాగుతుంది. మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులు నేచురల్ పర్‌ఫార్మెన్స్ చేశారు. అజయ్, వంశీ, హేమంత్, ఆంటోనీ తమ క్యారెక్టర్స్‌ను అద్బుతంగా పోషించారు" అని ప్రభు అన్నారు.

"దర్శకుడు హరినాథ్ పులి చిన్న వాడైనా ఎంతో క్లారిటీగా ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాడు. మేమంతా రేవు సినిమా చూసి ఎలాంటి అనుభూతికి లోనయ్యామో.. అదే అనుభూతిని రేపు మీరంతా థియేటర్ లో చూస్తూ పొందుతారు. సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మేము రిలీజ్ డేట్ గురించి అనుకున్నాం. త్వరలోనే ఆ డేట్ అనౌన్స్ చేస్తాం" అని రేవు పర్యవేక్షకులు ప్రభు చెప్పారు.

"మేము ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడుతున్నామంటే నటుడిగా ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కారణం. మా నాన్న ఉంటే నన్ను ఇలా చూసి సంతోషించేవారు. రేవు మూవీలో విలన్ క్యారెక్టర్‌లో మీ ముందుకు రాబోతున్నాను. మా టీమ్‌కు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి థ్యాంక్స్" అని నటుడు హేమంత్ ఎమోషనల్ అయ్యారు.

"రేవు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఓ మంచి రోల్‌లో నటించాను. మట్టి ముద్దలా సెట్‌కు వెళ్లిన మమ్మల్ని మంచి బొమ్మల్లాంటి పర్‌ఫార్మెన్స్ తీసుకున్నారు దర్శకుడు హరినాథ్. రేవు మూవీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా" అని మరో నటుడు ఆంటోనీ అన్నారు.

WhatsApp channel