Suriya Retro Release Date: సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న సినిమా-retro movie release date suriya pooja hegde movie to release on 1st may ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Retro Release Date: సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న సినిమా

Suriya Retro Release Date: సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న సినిమా

Hari Prasad S HT Telugu
Jan 08, 2025 07:13 PM IST

Suriya Retro Release Date: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న రెట్రో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్న సూర్య.. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న సినిమా
సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఇదే.. సమ్మర్ హాలిడేస్‌కు వస్తున్న సినిమా

Suriya Retro Release Date: సూర్య నటిస్తున్న రెట్రో మూవీ రిలీజ్ డేట్ ను బుధవారం (జనవరి 8) మేకర్స్ అనౌన్స్ చేశారు. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు రిలీజ్ డేట్ ను వెల్లడించారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయనున్నారు. ఇదొక పీరియాడిక్ యాక్షన్ మూవీ కావడం విశేషం. ఇప్పటికే ఈ రెట్రో నుంచి సూర్య లుక్ వైరల్ అవుతోంది.

yearly horoscope entry point

రెట్రో రిలీజ్ డేట్

సూర్య నటిస్తున్న 44వ సినిమా రెట్రో. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన కంగువ మూవీ తర్వాత వస్తున్న ఈ రెట్రోపై సూర్య భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన రిలీజ్ కానుంది.

సమ్మర్ హాలిడేస్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటం విశేషం. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ఇందులో సూర్య చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ది వన్ ఫ్రమ్ మే వన్ అనే అక్షరాలు ఈ పోస్టర్ పై చూడొచ్చు.

ఏంటీ రెట్రో మూవీ?

1980ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్నాడు. పీరియడ్ మూవీకి సూటయ్యేలా ‘రెట్రో’ అనే ఇంట్రెస్టిగ్ టైటిల్‍ను మూవీ టీమ్ ఖరారు చేసింది. క్రిస్మస్ సమయంలో వచ్చిన టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. గుడిలో మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్‍తో మొదలవుతుంది.

"నా కోపం కంట్రోల్ చేస్తావా. మా నాన్నతో కలిసి పని చేయడం ఆపేస్తా” అని పూజాతో సూర్య అంటాడు. రౌడీయిజం, గూండాయిజం అన్నీ మానేస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత టీజర్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సూర్య ఇంటెన్స్ లుక్‍లో కనిపించాడు. ప్రేమ కోసమే ఉన్నానని, పెళ్లి చేసుకుందామా అని పూజా హెగ్డేను సూర్య అడుగుతాడు. సరే అని పూజా తల ఊపుతుంది. స్వాగ్‍తో కూర్చొని సూర్య సిగరెట్ తాగే షాట్‍తో టీజర్ ముగిసింది. ఈ టీజర్‌లో జయరాం, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ సహా మరికొందరు కనిపించారు.

లవ్, యాక్షన్‍తో రెట్రో మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ప్రేమలో పడిన గ్యాంగ్‍స్టర్ కథలా కనిపిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్.. లవ్ స్టోరీతో ఈ సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ ఆసక్తికరంగా సాగి సినిమాపై అంచనాలను పెంచేసింది. కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ మార్క్, టేకింగ్ కనిపిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించేలా ఉంది.

రెట్రో టీజర్‌లో పూజా హెగ్డే లుక్ ఆకట్టుకుంది. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లో బుట్టబొమ్మ కనిపించింది. ఈ చిత్రంలో పూజాది ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అని అర్థమవుతోంది. పెద్ద మీసాలతో సూర్య లుక్ కూడా డిఫరెంట్‍గా ఉంది.

Whats_app_banner