Guntur Kaaram: మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నది ఇందుకేనా..!-reson behind pooja hegde exit from mahes babu trivikram movie guntur kaaram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram: మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నది ఇందుకేనా..!

Guntur Kaaram: మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకున్నది ఇందుకేనా..!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 21, 2023 11:24 PM IST

Guntur Kaaram: గుంటూరు కారం మూవీ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల తప్పుకుంది. అయితే, ఇందుకు కారణం తాజాగా బయటికి వచ్చింది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

Guntur Kaaram - Pooja Hegde: హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో చాలా కాలం తర్వాత గుంటూరు కారం మూవీ రూపొందుతోంది. 13 ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేశ్‍ను ఎంత పవర్‌ఫుల్‍గా, మాస్‍గా చూపిస్తాడోనని అభిమానులు వేచిచూస్తున్నారు. అయితే, ఇటీవల ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే బయటికి వెళ్లిపోయింది. ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఈ విషయం చిన్నపాటి కలవరానికి గురి చేసింది. అయితే, పూజా హెగ్డే గుంటూరు కారం చిత్రం నుంచి తప్పుకునేందుకు కారణం తాజాగా బయటికి వచ్చింది.

ముందు చెప్పిన దానితో పోలిస్తే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గుంటూరు కారం కథకు ఆ తర్వాత భారీగా మార్పులు చేశాడట. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర పోర్షన్‍లో చాలా ఛేంజెస్ చేశాడట. దీంతో సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత తగ్గిపోయిందని పూజా హెగ్డే భావించిందని సమాచారం. దీంతో మూవీ నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకుందని తెలుస్తోంది. అలాగే, గుంటూరు కారం మూవీ నుంచి తప్పుకున్న తర్వాత ఆ డేట్‍లను ఓ బాలీవుడ్ మూవీకి కేటాయించిందట పూజా హెగ్డే.

పూజా హెగ్డే తప్పుకోవటంతో.. గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‍గా ఉన్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఫీమేల్ లీడ్ చేయనుందని సమాచారం. మెయిన్ హీరోయిన్ పాత్రను ఆమె పోషించడం దాదాపు ఖరారైందని టాక్. ఇప్పటికే చాలా మూవీలతో దూసుకుపోతున్న శ్రీలీలకు ఇది మంచి అవకాశంగా ఉండనుంది. ఇక ఈ మూవీ కోసం పూజా హెగ్డేకు రూ.4కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే, ఈ మూవీకి ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసి తప్పుకుంది పూజా హెగ్డే.

మరోవైపు, సంగీత దర్శకుడు ఎస్ థమన్ కూడా గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వెళ్లినట్టు పుకార్లు వచ్చాయి. అయితే, ప్రాజెక్టులో ఉండాలని త్రివిక్రమ్‍తో పాటు నిర్మాతలు కూడా థమన్‍పై ఒత్తిడి చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తన పట్ల కొందరు ఓర్వలేకున్నారంటూ థమన్ చేసిన ట్వీట్ దీని గురించేనా అనే సందేహాలు కూడా వ్యక్తవుతున్నాయి.

గుంటూరు కారం తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళితో భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన లాంఛనంగా ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు, గుంటూరు కారం మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Whats_app_banner