Aamir Focus on South: సౌత్‌పై ఆమీర్ ఫోకస్.. ఆ స్టార్ డైరెక్టర్‌తో పనిచేసేందుకు ఆసక్తి..!
Aamir Focus on South: బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు. ఆయన కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్.
Aamir Focus on South: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ గతేడాది లాల్ సింగ్ చడ్ఢా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టులో విడుదలై అనుకున్న స్థాయిలో ఆకట్టులేకపోయింది. బాయ్ కాట్ బాలీవుడ్ సెగ గట్టిగా తగిలిన ఈ చిత్రం వసూళ్ల పరంగానూ పుంజుకోలేకపోయింది. నాగచైత్యన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆమీర్ ఆచితూచి తన తదుపరి ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఇంత వరకు సినిమాల గురించి ఎలాంటి ప్రకటన చేయని ఆయన.. పలు కథలను వింటున్నారు. అయితే బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఆమీర్ తన ఫోకస్ సౌత్ ఇండస్ట్రీపై పెట్టినట్లు తెలుస్తోంది. సౌత్ దర్శకులు, నిర్మాతలతో తన తదుపరి ప్రాజెక్టును తెరకెక్కించే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఆమీర్ ఖాన్ తన తదుపరి సినిమాను కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని వర్కౌటైతే పాన్ఇండియా స్థాయిలో వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరోపక్క ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్‌టీఆర్‌తో ఓ ప్రాజెక్టు చేయనున్నారు. మరి ఈ సినిమా తర్వాత ఆమీర్ ఖాన్‌తో సినిమా చేస్తారా లేక ఇటీవల కేజీఎఫ్ మేకర్స్ ప్రకటించినట్లుగా కేజీఎఫ్3కి శ్రీకారం చుడతారా అనేది వేచి చూడాలి.
కేజీఎఫ్2 సినిమాతో ఇప్పటికే ప్రశాంత్ పలువురు బాలీవుడ్ నటులతో పనిచేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఆమీర్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం లేకపోలేదు.
సంబంధిత కథనం