Repeat Telugu Movie Review: రిపీట్ మూవీ రివ్యూ - ఫేక్ ఎన్‌కౌంట‌ర్ క‌థ‌-repeat movie telugu review naveen chandras mystery crime thriller movie ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Repeat Movie Telugu Review Naveen Chandras Mystery Crime Thriller Movie Ott Review

Repeat Telugu Movie Review: రిపీట్ మూవీ రివ్యూ - ఫేక్ ఎన్‌కౌంట‌ర్ క‌థ‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 01, 2022 08:01 AM IST

Repeat Telugu Movie Review: న‌వీన్‌చంద్ర, మ‌ధుబాల‌, అచ్యుత్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా రిపీట్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా డిసెంబ‌ర్ 1న (నేడు)డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది.

న‌వీన్‌చంద్ర
న‌వీన్‌చంద్ర

Repeat telugu Movie Review: డిఫ‌రెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ న‌టుడిగా థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాడు న‌వీన్‌చంద్ర‌ (Naveen chandra). అత‌డు హీరోగా న‌టించిన తాజా చిత్రం రిపీట్‌ (Repeat movie). క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు అర‌వింద్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మ‌ధుబాల, స్మృతివెంక‌ట్‌, అచ్యుత్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళంలో డెజావు, తెలుగులో రిపీట్ పేరుతో ఒకేసారి ఈ సినిమా రూపొందింది. త‌మిళంలో గ‌త జూన్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా డిసెంబ‌ర్ 1న (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ (Disney plus hotstar) ఓటీటీలో రిలీజైన రిపీట్ సినిమా ఎలా ఉందంటే...

Repeat Movie Story -డీజీపీ కూతురు మిస్సింగ్‌...

సుబ్ర‌హ్మ‌ణ్యం (అచ్యుత్ కుమార్) న‌వ‌ల ర‌చ‌యిత‌. క్రైమ్ న‌వ‌ల‌ల్లో అత‌డు ఊహించి రాసిన సంఘ‌ట‌న‌లు రియ‌ల్ లైఫ్‌లో జ‌రుగుతుంటాయి.. డీజీపీ ఆశాప్ర‌మోద్ (మ‌ధుబాల‌) కూతురు పూజ కిడ్నాప్ అవుతుంది.

ఆ కిడ్నాప‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం అనే అనుమానంతో అత‌డితో పోలీసుల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఈ సంఘ‌ట‌న‌ల మీడియాలో హైలైట్ కావ‌డంతో డీజీపీపై విమ‌ర్శ‌లొస్తాయి. దాంతో త‌న కూతురు కిడ్నాప్ కేసును మీడియాకు తెలియ‌కుండా సైలెంట్‌గా సాల్వ్ చేయాల‌ని అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ (న‌వీన్‌చంద్ర‌) స‌హాయం తీసుకుంటుంటుంది ఆశా ప్ర‌మోద్‌.

అస‌లు పూజ‌ను కిడ్నాప్ చేసింది ఎవ‌రు? డీజీపీ కూతురు కిడ్నాప్‌తో ర‌చ‌యిత‌ సుబ్ర‌హ్మ‌ణ్యానికి ఉన్న సంబంధ‌మేమిటి? ఆశా ప్ర‌మోద్ చేసిన ఓ ఫేక్ ఎన్‌కౌంట‌ర్ మిస్ట‌రీని విక్ర‌మ్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? జ‌న‌ని అనే అమ్మాయి గ్యాంగ్ రేప్‌లో ఎన్ కౌంట‌ర్ చేయ‌బ‌డిన‌ క్యాబ్ డ్రైవ‌ర్ మ‌ర‌లా బ‌తికి ఎలా వ‌చ్చాడ‌న్న‌దే ఈ సినిమా ఈ క‌థ‌.

Repeat Film Analysis -రివేంజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌...

రివేంజ్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు అర‌వింద్ శ్రీనివాస‌న్ రిపీట్ సినిమాను తెర‌కెక్కించాడు. త‌న‌కు అన్యాయం చేసిన వారిపై హీరో తెలివితేట‌ల‌తో ప‌గ తీర్చుకోవ‌డం అనే కామ‌న్ ఫార్ములాతో రివేంజ్ సినిమాలు రూపొందుతుంటాయి. రిపీట్‌ కూడా అలాంటి క‌థ‌నే. త‌న స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో రొటీన్ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కులు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. చివ‌రి సీన్ వ‌ర‌కు సినిమాలోని అస‌లైన మెయిన్ పాయింట్ రివీల్ కాకుండా స‌స్పెన్స్‌ను హోల్డ్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

సుబ్ర‌హ్మ‌ణ్యం ర‌చ‌న‌లు...

జ‌రుగ‌బోయే నేరాల‌ను సుబ్ర‌హ్మ‌ణ్యం ముందుగానే ఊహించి త‌న న‌వ‌ల‌ల్లో రాయ‌డం, అత‌డు రాసిన న‌వల‌ల్లోని క్యారెక్ట‌ర్స్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని బెదిరించ‌డం లాంటి సీన్స్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. డీజీపీ కూతురు కిడ్నాప్ కావ‌డం, ఆ కిడ్నాప్ వెనుక సూత్ర‌ధారి సుబ్ర‌హ్మ‌ణ్యం అంటూ పోలీసులు అనుమాన‌ప‌డే స‌న్నివేశాల‌తో త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుందోన‌నే టెన్ష‌న్‌ను ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేయ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు. ఎప్పుడైనే విక్ర‌మ్ ఎంట‌ర్ అవుతాడో అక్క‌డి నుంచి సినిమా కాస్త నెమ్మ‌దించిన ఫీలింగ్ క‌లుగుతుంది. విక్ర‌మ్ ఇన్వెస్టిగేష‌న్ చేసే సీన్స్ బోరింగ్‌గా సాగుతాయి. ఆ ఇన్వేస్టిగేష‌న్ సీన్స్‌ను డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.

ఫేక్ ఎన్‌కౌంట‌ర్ క‌థ‌...

పూజ కిడ్నాప్ కేసులోనే ఆశా ప్ర‌మోద్ చేసిన ఓ ఫేక్ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన ఒక్కో క్లూను రివీల్ కావ‌డం ఆక‌ట్టుకుంటుంది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ్యామిలీకి జ‌రిగే అన్యాయాన్ని ఎమోష‌న‌ల్‌గా చూపించారు. హీరో క్యారెక్ట‌ర్‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ బాగుంటుంది.

మ‌ధుబాల మిస్ కాస్టింగ్‌...

విక్ర‌మ్‌ అనే అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఇంటెన్స్ రోల్‌లో న‌వీన్ చంద్ర న‌ట‌న బాగుంది. సీరియ‌స్ రోల్‌లో సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. డీజీపీగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో మ‌ధుబాల రాంగ్ కాస్టింగ్ చెప్ప‌వ‌చ్చు. విల‌నిజం ఛాయ‌లు ఆమె న‌ట‌న‌లో క‌నిపించ‌లేదు. సుబ్ర‌హ్మ‌ణ్యం అనే రైట‌ర్ పాత్ర‌లో క‌న్న‌డ న‌టుడు అచ్యుత్ కుమార్ పూర్తిగా ఒదిగిపోయాడు. హీరో ఇన్వెస్టిగేష‌న్‌లో స‌హాయ ప‌డే పోలీసులుగా స‌త్యంరాజేష్‌, పూజా రామ‌చంద్ర‌న్ క‌నిపించారు. పాట‌ల‌కు క‌థ‌లో స్కోప్ లేదు. బ‌ల‌వంతంగా ఇరికించే ప్రయ‌త్నం ద‌ర్శ‌కుడు చేయ‌లేదు. జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

డీసెంట్ థ్రిల్ల‌ర్‌...

చిన్న చిన్న లోపాల‌న్నా డీసెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రిపీట్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది.

Repeat Movie Plus and Minus

బ‌లాలు

క‌థ‌, క‌థ‌నాలు

న‌వీన్‌చంద్ర‌, అచ్యుత్ కుమార్ న‌ట‌న‌

క‌థ‌లోని మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు

లాజిక్స్ మిస్ కావ‌డం

మ‌ధుబాల క్యారెక్ట‌ర్‌

ఇన్వెస్టిగేష‌న్ సీన్స్ బోరింగ్‌గా సాగ‌డం

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.