Prashanth Neel: కేజీఎఫ్ మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేజీఎఫ్ 2 మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఓ ట్రెండ్ సెట్ఠర్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్‌తో సలార్ మూవీని రూపొందించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా సలార్ నిలిచింది. ప్రభాస్ హీరోయిజం, ఎలివేషన్లతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను అలరించాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలతో యాక్షన్ మూవీస్‌లో ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్, కేజీఎఫ్2తో పాటు సలార్ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతోన్నారు.
కేజీఎఫ్ కంటే ముందు కన్నడంలో ఉగ్రం సినిమా చేశాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం మూవీలో శ్రీమురళి హీరోగా నటించాడు. ఉగ్రం మూవీకి రీమేక్‌గానే ప్రభాస్ సలార్ తెరకెక్కడం గమనార్హం. ఉగ్రం మూవీ కన్నడంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై హిట్ టాక్‌ను తెచ్చుకున్నది. మౌత్ టాక్‌తో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
ఉగ్రం హీరో శ్రీమురళి ప్రశాంత్ నీల్‌కు బావ అవుతాడు. ప్రశాంత్ నీల్ సోదరి విద్యను 2008లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు శ్రీమురళి. బావ అయిన శ్రీమురళి...డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఉగ్రం కథతో సినిమా చేయాలని కొంత మంది స్టార్ హీరోలను కలిశాడు ప్రశాంత్ నీల్. కానీ వారందరూ ఉగ్రం కథను రిజెక్ట్ చేయడంతో చివరకు తన బావ అయినా శ్రీమురళితోనే ఈ సినిమా చేశాడు ప్రశాంత్ నీల్. ఎన్నో అడ్డంకుల నడుమ మూడేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీ 20014లో రిలీజైంది.
ఉగ్రం కంటే ముందు శ్రీ మురళి నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలవడంతో ఈ సినిమాను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. యావరేజ్ అనుకున్న మూవీ కాస్త మౌత్‌టాక్ మెళ్లగా వసూళ్లు పెరిగి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఉగ్రంతోనే కన్నడంలో స్టార్ హీరోగా మారిపోయాడు శ్రీమురళి. ఉగ్రం మూవీలో అగస్త్య అనే పాత్రలో శ్రీమురళి కనిపించాడు. తన జీవితాన్ని మార్చిన ఈ పాత్ర పేరును తన కొడుకుకు పెట్టుకున్నాడు శ్రీమురళి. ప్రస్తుతం శ్రీమురళి భఘీర పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందిస్తోన్నాడు.
టాపిక్