Thriller OTT: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ - ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే
Thriller OTT: ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రేఖచిత్రం నిలిచింది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్చి నెలలో సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓటీటీలో ఐదు భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖ చిత్రం ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఫిబ్రవరిలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఓటీటీ ఫ్యాన్స్‌కు మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్లలో రిలీజైన రెండు నెలల గ్యాప్ తర్వాతే రేఖ చిత్రం మూవీని ఓటీటీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.
ఓటీటీ రిలీజ్ డేట్...
తాజాగా రేఖ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి 14 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషల్లో విడుదల అవుతోన్నట్లు సమాచారం. ఈ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్లు సోషల్ మీడియాలో కనిపిస్తోన్నాయి.
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్...
మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రేఖ చిత్రం మూవీలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపించాడు. జోషిన్ చాకో దర్శకత్వం వహించాడు.
55 కోట్ల కలెక్షన్స్...
జనవరి 9న థియేటర్లలో రిలీజైన రేఖచిత్రం మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2025లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 55 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ యాక్టింగ్ బాగుందంటూ ఫ్యాన్స్ పేర్కొన్నారు. మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
రేఖ చిత్రం కథ ఇదే...
వివేక్ గోపీనాథ్ ఓ పోలీస్ ఆఫీసర్. డ్యూటీలో ఉండగా ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ పై అధికారులకు దొరికిపోతాడు. అతడిని ఓ ఆటవీ ప్రాంతానికి బదిలీ చేస్తారు. వివేక్ గోపీనాథ్ డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఓ ఛాలెంజింగ్ కేసు అతడికి ఎదురవుతుంది. నలభై ఏళ్ల క్రితం మరికొందరితో చేసిన చేసిన మర్డర్ గురించి ఫేస్‌బుక్ లైవ్‌లో బయటపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అతడు చంపింది ఎవరిని? నలభై ఏళ్ల క్రితం నాటి కేసును వివేక్ గోపీనాథ్ ఎలా ఛేదించాడు? మమ్ముట్టి అభిమాని అయిన సినీ హీరోయిన్ రేఖ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
కిష్కింద కాండం...
రేఖచిత్రం కంటే ముందు ఆసిఫ్ అలీ హీరోగా నటించిన కిష్కింద కాండం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 77 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం