World Cup 2023: ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగెడుతా: తెలుగు హీరోయిన్-rekha boj sensational comments on india world cup 2023 won ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  World Cup 2023: ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగెడుతా: తెలుగు హీరోయిన్

World Cup 2023: ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగెడుతా: తెలుగు హీరోయిన్

Sanjiv Kumar HT Telugu

Rekha Boj About India World Cup 2023: భారత్ వరల్డ్ కప్ 2023 గెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది తెలుగు హీరోయిన్ రేఖా భోజ్. దీంతో ఇండియా వరల్డ్ కప్‌పై రేఖా భోజ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్‌లో నగ్నంగా పరుగెడుతా: తెలుగు హీరోయిన్

Rekha Boj On If India World Cup Won: వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో భారత్ దూసుకుపోతోంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఈ ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఇండియా ఇప్పటికీ వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చింది. ఈ నేపథ్యంలో ఇండియా వరల్డ్ కప్ కొట్టడం ఖాయమని భారతీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్, వైజాగ్ ముద్దుగుమ్మ రేఖా భోజ్ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

"ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా.." అని తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా రేఖా భోజ్ సంచలన పోస్ట్ చేసింది. స్ట్రీకింగ్ అంటే పబ్లిక్ ప్లేసులో దుస్తులు లేకుండా నగ్నంగా పరిగెత్తడం. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు రేఖా భోజ్ కామెంట్సే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇలా ప్రపంచ కప్‌ను భారత్ గెలిస్తే పూనమ్ పాండేతో పాటు ఎంతో మంది మోడల్స్ గతంలో కామెంట్స్ చేశారు.

ఇలాంటి కామెంట్స్ కేవలం ఫేమ్ కోసం, హైప్ కోసమే చేస్తారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాటికి "క్రికెట్ అంటే ఎమోషన్. కాబట్టి విప్పడంలో తప్పేం లేదు. నేను మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు" అని రిప్లై ఇస్తుంది రేఖా భోజ్. ఇదిలా ఉంటే, రేఖా భోజ్ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, అంతగా గుర్తింపు రాలేదు.

దామినీ విల్లా, కాత్సాయని వంటి తెలుగు చిత్రాల్లో నటించిన రేఖా భోజ్ వైజాగ్‌లో సొంతగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్స్ చేస్తుంది. వాటితో సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ అవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కూడా ఈ బ్యూటి వైరల్ అవుతుంటుంది.