Re-release Movie: అప్పుడు అట్టర్ ఫ్లాప్.. రీరిలీజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ మూవీ గురించి తెలుసా?
Re-release Movie: ఓ రీరిలీజ్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. 9 ఏళ్ల కిందట రిలీజైన ఓ చిన్న బాలీవుడ్ మూవీ.. అట్టర్ ఫ్లాప్ కాగా.. ఇప్పుడు తొలి వీకెండే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Re-release Movie: బాలీవుడ్ మూవీ సనమ్ తేరీ కసమ్ మూవీ రీరిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. హాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన క్రిస్టఫర్ నోలాన్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ రీరిలీజ్ లో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించగా.. ఈ చిన్న సినిమా మాత్రం దూసుకెళ్తోంది. 2016లో తొలిసారి రిలీజైనప్పుడు లైఫ్ టైమ్ సాధించిన కలెక్షన్ల కంటే ఇప్పుడు తొలి వీకెండ్ లోనే 170 శాతం ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.
సనమ్ తేరీ కసమ్ రికార్డులు
బాలీవుడ్ నటులు హర్షవర్దన్ రాణే, మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరీ కసమ్ మూవీ 2016లో తొలిసారి రిలీజైంది. ఇందులోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయినా.. మూవీ మాత్రం ఫ్లాపయింది. గత శుక్రవారం (ఫిబ్రవరి 7) రీరిలీజ్ చేశారు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.15.5 కోట్లు వసూలు చేసింది. ఇది తొలిసారి వసూలు చేసిన మొత్తం కంటే 170 శాతం ఎక్కువ కావడం విశేషం. రోజురోజుకూ ఈ సినిమా వసూళ్లు ఎక్కువవుతూనే ఉన్నాయి.
తొలి రోజు రూ.4.24 కోట్లు, రెండో రోజు రూ.5.25 కోట్లు, మూడో రోజు రూ.6 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సనమ్ తేరీ కసమ్ మూవీకి అంత మంచి టాక్ రాకపోయినా.. పాటలు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఇందులోని పాటలు అలరిస్తూనే ఉన్నాయి.
ఇంటర్‌స్టెల్లార్ రీరిలీజ్ వసూళ్లు ఇలా..
అటు హాలీవుడ్ లో పదేళ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఇంటర్‌స్టెల్లార్. ఇప్పుడీ సినిమా కూడా ఇండియాలో రీరిలీజైంది. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే మూవీని రిలీజ్ చేశారు. తొలి వీకెండ్ రూ.9 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.2.4 కోట్లు, శనివారం రూ.3.25 కోట్లు, ఆదివారం రూ.3.25 కోట్లు వసూలు చేసింది.
ఈ మూవీ రీరిలీజ్ లో మొత్తంగా రూ.15 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను 16.5 కోట్ల డాలర్ల బడ్జెట్ తో రూపొందించగా.. ప్రపంచవ్యాప్తంగా 74.8 కోట్ల డాలర్లు వసూలు చేసింది. సుమారు మూడు గంటల రన్ టైమ్ తో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ప్రేమికులను ఉర్రూతలూగించింది.
సంబంధిత కథనం
టాపిక్