Ram Charan Narthan Movie: నేవీ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్‌సీ17- క‌న్న‌డ డైరెక్ట‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్‌-rc 17 update ram charan narthan movie in navy backdrop ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc 17 Update Ram Charan Narthan Movie In Navy Backdrop

Ram Charan Narthan Movie: నేవీ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్‌సీ17- క‌న్న‌డ డైరెక్ట‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 09, 2023 08:51 AM IST

Ram Charan Narthan Movie: రామ్‌చ‌ర‌ణ్ 17వ సినిమాకు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాకు క‌న్న‌డ మూవీ మ‌ఫ్టీ ఫేమ్ నార్త‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Narthan Movie: ఆర్ఆర్ఆర్ స‌క్సెస్‌తో జోష్ మీదున్న రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆరు సినిమాల్ని లైన్‌లో పెట్టారు. ఇటీవ‌ల హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

అందులో క‌న్న‌డ డైరెక్ట‌ర్ నార్త‌న్‌తో చేయ‌బోతున్న సినిమా ఒక‌ట‌ని స‌మాచారం. నావీ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌తో ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. పాయింట్ న‌చ్చ‌డంతో చ‌ర‌ణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న ఈ సినిమాను ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించ‌నున్న 17వ సినిమా ఇదేన‌ని అంటున్నారు.

2017లో రూపొందిన క‌న్న‌డ చిత్రం మ‌ఫ్టీతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు నార్త‌న్‌. గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా క‌న్న‌డంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

కాగా ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌సీ 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది

IPL_Entry_Point