Rc 16 Update: ఆర్‌సీ 16 మూవీపై డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశాడు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీకి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతోన్నట్లు వెల్లడించాడు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు బుచ్చిబాబు. నా ఇద్దరు ఫేవరేట్ పీపుల్‌తో అంటూ ఈ ట్వీట్‌లో బుచ్చిబాబు సానా పేర్కొన్నాడు.
ఆర్‌సీ 16 మూవీకి సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు ఫుల్ సింగ్స్‌లో జరుగుతున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ నాలుగు పాటల కంపోజింగ్ పూర్తిచేసినట్లు సమాచారం. ఆర్‌సీ 16 మూవీతో లాంగ్ బ్యాక్ తర్వాత ఏఆర్ రెహమాన్ టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇస్తోన్నాడు.
ఆర్‌సీ 16 మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో ఈ బాలీవుడ్ బ్యూటీ అంగీకరించిన సెకండ్ మూవీ ఇది. ఇందులో కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. శివరాజ్‌కుమార్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే మేకర్స్ ఆఫీషియల్‌గా ఈ న్యూస్‌ను ప్రకటించారు.
సినిమాలో అతడి రోల్ పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. మరోవైపు గత సినిమాలకు భిన్నంగా లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. ఉప్పెనకు మించి రామ్ చరణ్ సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని అంటున్నారు.
మార్చి నెలలో ఆర్‌సీ 16 మూవీ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో డైరెక్టర్ శంకర్, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏఆర్ రెహమాన్ కూడా పాల్గొన్నాడు. త్వరలోనే ఆర్‌సీ 16 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.
ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోన్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ పాన్ ఇండియన్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వినయవిధేయ రామ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ ముంబైలో ఉన్నారు. ఆనంద్ అంబానీ - రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. ఈ వివాహ వేడుకల కోసం సతీమణి ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చరణ్ ముంబై వెళ్లాడు. ఇటీవలే చరణ్ ఏడున్నర కోట్లతో రోల్స్ రాయిస్ స్పెక్ట్రా అనే కారును కొనుగులు చేశాడు. ఈ ఖరీదైన కారును కొన్న ఫస్ట్ సౌత్ ఇండియన్ సెలిబ్రిటీగా చరణ్ నిలిచాడు.