రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు ఆర్‌సీ 16 టీమ్ గుడ్ న్యూస్ వినిపించింది. ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసింది. రామ్‌చరణ్ మూవీకి పెద్ది అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్‌లో రామ్‌చరణ్ కనిపిస్తున్నారు.
ముక్కుకు పోగు, పొడవైన గడ్డంతో బీడీ వెలిగిస్తూ మాస్ లుక్‌లో రా అండ్ రస్టిక్‌గా రామ్‌చరణ్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
మరో పోస్టర్‌లో చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్‌లో గత సినిమాలకు భిన్నంగా రామ్ చరణ్ దర్శనమిచ్చాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకు అంచనాలకు పూర్తి భిన్నంగా రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ ఉండటం ఆసక్తిని పంచుతోంది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో జాతర సెట్, విలేజ్ నేటివిటీ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగాయి.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్, శివకుమార్‌కుమార్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు తెలిసింది.
దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. పెద్ది సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. పెద్ది మూవీతోనే లాంగ్ గ్యాప్ తర్వాత ఏఆర్ రెహమాన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో పెద్ది మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రామ్‌చరణ్ గత మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 150 కోట్లలోపే వసూళ్లను రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది.పెద్ది తర్వాత పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌తో రామ్‌చరణ్ ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్