RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందంటున్న రామ్‌చరణ్‌-rc 15 update as the team completes schedule in new zealand as ramcharan praises kiara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc 15 Update As The Team Completes Schedule In New Zealand As Ramcharan Praises Kiara

RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందంటున్న రామ్‌చరణ్‌

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 02:18 PM IST

RC 15 Update: కియారా స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు రామ్‌చరణ్‌. ఆర్సీ 15 టీమ్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుందని చెబుతూ అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై ప్రశంసలు కురిపించాడు.

న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేస్తున్న ఆర్సీ15 టీమ్
న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కేక్ కట్ చేస్తున్న ఆర్సీ15 టీమ్

RC 15 Update: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆర్సీ 15. ఈ సినిమా షూటింగ్‌ వాయిదాల పద్ధతిలో జరుగుతున్నా.. ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో శంకర్‌ అటు ఇండియన్ 2 మూవీ కూడా తీస్తుండటంతో ఆర్సీ 15కు అడ్డంకులు తప్పడం లేదు. అయితే తాజాగా ఆర్సీ15 టీమ్‌ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భాన్ని కేక్‌ కట్‌ చేసుకొని ఆ టీమ్ సెలబ్రేట్‌ చేసుకుంది. న్యూజిలాండ్‌లో షెడ్యూల్‌ పూర్తయిన విషయాన్ని రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. అక్కడ తమ షూటింగ్‌ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నాడు. తాను సింగిల్‌గా ఉన్న ఓ హ్యాండ్సమ్‌ లుక్‌ ఫొటోతోపాటు టీమ్‌ కేక్‌ కట్‌ చేసిన ఫొటో, మరికొన్ని ఇతర ఫొటోలను షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా కియారాతోపాటు ఇతర టీమ్‌ సభ్యులపై చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. "న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ ముగిసింది. పాట, దాని విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. శంకర్‌ గారు దానిని మరింత స్పెషల్‌గా మార్చారు. ఎప్పటిలాగే కియారా స్టన్నింగ్‌గా ఉంది. తమన్‌ మరోసారి ఇరగదీశాడు" అనే క్యాప్షన్‌తో చెర్రీ ఈ ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు.

కొన్ని రోజులుగా ఆర్సీ 15 టీమ్‌ నుంచి న్యూజిలాండ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. లొకేషన్‌లో కియారా, రామ్‌చరణ్‌ బర్గర్లు తింటూ ఎంజాయ్ చేస్తున్న ఫొటో కూడా అందులో ఒకటి.

ఆర్సీ 15 మూవీని దిల్ రాజు, శిరీష్‌ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌, కియారాతోపాటు ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి స్క్రిప్ట్‌ కార్తిక్‌ సుబ్బరాజు అందించగా.. మ్యూజిక్‌ తమన్‌ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

IPL_Entry_Point