Razakar OTT Streaming: ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే-razakar ott streaming anasuya movie on aha video ott gold subscribers can watch it ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Razakar Ott Streaming: ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే

Razakar OTT Streaming: ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే

Hari Prasad S HT Telugu
Jan 22, 2025 02:30 PM IST

Razakar OTT Streaming: ఓటీటీలోకి అనసూయ నటించిన రజాకార్ మూవీ రెండు రోజుల ముందే వచ్చేసింది. అయితే ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ మూవీని ఇప్పుడే చూడాలంటే ప్రత్యేకమైన సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.

ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే
ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే

Razakar OTT Streaming: ఓటీటీలోకి మరో హిస్టారికల్ డ్రామా పది నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది మార్చి 24న రిలీజైన రజాకార్ మూవీ బుధవారం (జనవరి 22) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే మూవీ అందుబాటులోకి వచ్చింది. అందరూ చూడాలంటే మాత్రం శుక్రవారం (జనవరి 24) వరకు ఆగాల్సిందే.

yearly horoscope entry point

రజాకార్ ఓటీటీ స్ట్రీమింగ్

రజాకార్ మూవీ తమ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతున్న విషయాన్ని ఆహా వీడియో ఓటీటీ బుధవారం వెల్లడించింది. తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేసింది. "రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగంలో దిగిన కథ, చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు కథని ఆహాలో చూడండి.

ఆహాగోల్డ్ లో ఇప్పుడే చూడండి" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిపింది. ఆహా గోల్డ్ కాకుండా సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మాత్రం శుక్రవారం (జనవరి 24) నుంచి ఈ మూవీని చూడొచ్చు. గతేడాది మార్చి 24న రిలీజైన ఈ సినిమా సరిగ్గా పది నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఏంటీ రజాకార్ మూవీ?

రజాకార్ మూవీ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. నిజాం పాల‌న‌లో ర‌జాకార్లు ఎలాంటి దురాగ‌తాలు, హింస‌ల‌కు పాల్ప‌డ్డార‌నే అంశాలతో ద‌ర్శ‌కుడు యాటా స‌త్య‌నారాయ‌ణ ర‌జాకార్ మూవీని తెర‌కెక్కించాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ క‌థ‌ను రాసుకున్నాడు. తెలంగాణ సాయిధ పోరాటంలో అమ‌రులైన చాలా మంది యోధుల జీవితాల‌తో ఎమోష‌న‌ల్‌గా ఈ మూవీ సాగుతుంది. ఓ వైపు ప్ర‌జా పోరాటం, మ‌రోవైపు ర‌జాక‌ర్ల దురాగ‌తాలు వీటికి స‌మాంత‌రంగా హైద‌రాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు ప‌టేల్ చేసిన ప్ర‌య‌త్నాల చుట్టూ క‌థ‌ను అల్లుకున్నారు.

ర‌జాకార్ సినిమాలో ప్ర‌త్యేకంగా హీరోలు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి ప‌ది, ప‌దిహేను నిమిషాల‌కు ఓ పాత్రను తెర‌పైకి తీసుకొస్తూ ఆస‌క్తిక‌రంగా క‌థ‌ను ముందుకు న‌డిపించారు డైరెక్ట‌ర్‌. తెలంగాణ సాయుధ పోరాటంలో బాగా ప్రాచుర్యం పొందిన వారి జీవితాల్ని, చ‌రిత్ర‌లో నిలిచిపోయిన కొన్ని సంఘ‌న‌టన‌ల‌ను సినిమాలో చూపించారు.

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌కుండా య‌థార్ఠంగా ఏం జ‌రిగిందో అదే చెప్పేందుకు త‌ప‌న ప‌డ్డారు. ర‌జాక‌ర్ సినిమాలో చూపించిన‌వ‌న్నీ చాలా వ‌ర‌కు తెలిసిన క‌థ‌లే. అయినా ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అయ్యేలా ఎమోష‌న్స్‌, డ్రామా బ‌లంగా పండేలా సీన్స్ రాసుకున్నాడు. షోయాబుల్లాఖాన్‌, చాక‌లి ఐల‌మ్మ‌, రాజారెడ్డి తో పాటు చాలా మంది నాయ‌కుల పోరాటప‌ఠిమ‌ను స్ఫూర్తిదాయ‌కంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం