Razakar OTT Release Date: ఓటీటీలోకి పది నెలల తర్వాత వస్తున్న అనసూయ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Razakar OTT Release Date: ఓటీటీలోకి అనసూయ నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా పది నెలల తర్వాత వస్తోంది. తాజాగా మంగళవారం (జనవరి 7) ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
Razakar OTT Release Date: రజాకార్ సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్.. గతేడాది మార్చి 24న థియేటర్లలో రిలీజైన మూవీ ఇది. మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మంగళవారం (జనవరి 7) వెల్లడిచింది. యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయతోపాటు బాబీసింహ, ఇంద్రజ, వేదికలాంటి వాళ్లు నటించారు.
రజాకార్ ఓటీటీ రిలీజ్ డేట్
అనసూయ నటించిన మూవీ రజాకార్ సైలెంట్ జినోసైడ్ ఆఫ్ హైదరాబాద్. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనానికి ముందు జరిగిన ఘటనలు, రజాకార్ల ఆకృత్యాలను ఈ సినిమా ద్వారా మేకర్స్ తెరకెక్కించారు. ఈ రజాకార్ మూవీ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఆహా వీడియో ఓటీటీ జనవరి 24 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
"ధైర్యం, చరిత్ర, ఎవరూ చెప్పని స్టోరీ.. రజాకార్ జనవరి 24న ఆహా వీడియోలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ స్పెషల్ పోస్టర్ ను కూడా లాంచ్ చేసింది. రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందు నుంచి ఈ చారిత్రక నేపథ్యంలో సాగే మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
రజాకార్ మూవీ ఎలా ఉందంటే?
నిజాం పాలనలో రజాకార్లు ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతో దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ మూవీని తెరకెక్కించాడు. యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాడు. తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన చాలా మంది యోధుల జీవితాలతో ఎమోషనల్‌గా ఈ మూవీ సాగుతుంది. ఓ వైపు ప్రజా పోరాటం, మరోవైపు రజాకర్ల దురాగతాలు వీటికి సమాంతరంగా హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాల చుట్టూ కథను అల్లుకున్నారు.
రజాకార్ సినిమాలో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరూ లేరు. ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ పాత్రను తెరపైకి తీసుకొస్తూ ఆసక్తికరంగా కథను ముందుకు నడిపించారు డైరెక్టర్. తెలంగాణ సాయుధ పోరాటంలో బాగా ప్రాచుర్యం పొందిన వారి జీవితాల్ని, చరిత్రలో నిలిచిపోయిన కొన్ని సంఘనటనలను సినిమాలో చూపించారు.
చరిత్రను వక్రీకరించకుండా యథార్ఠంగా ఏం జరిగిందో అదే చెప్పేందుకు తపన పడ్డారు. రజాకర్ సినిమాలో చూపించినవన్నీ చాలా వరకు తెలిసిన కథలే. అయినా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఎమోషన్స్, డ్రామా బలంగా పండేలా సీన్స్ రాసుకున్నాడు. షోయాబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ, రాజారెడ్డి తో పాటు చాలా మంది నాయకుల పోరాటపఠిమను స్ఫూర్తిదాయకంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు.