Ravi Teja with 6 Heroines: ఆరుగురు హీరోయిన్లు.. ఆరు పాటలు.. రవితేజ సూపర్ ఫీట్-ravi teja with 6 heroines in his next 2 movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja With 6 Heroines In His Next 2 Movies

Ravi Teja with 6 Heroines: ఆరుగురు హీరోయిన్లు.. ఆరు పాటలు.. రవితేజ సూపర్ ఫీట్

Hari Prasad S HT Telugu
Feb 17, 2023 09:31 PM IST

Ravi Teja with 6 Heroines: ఆరుగురు హీరోయిన్లు.. ఆరు పాటలు.. ఇదీ మాస్ మహారాజా రవితేజ సాధించబోతున్న సూపర్ ఫీట్. అతని నెక్ట్స్ మూవీస్ రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలలో ఈ సాంగ్స్ అలరించనున్నాయి.

రవితేజ
రవితేజ

Ravi Teja with 6 Heroines: ఒక హీరో.. ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు అన్నది చాలా కాలంగా ఉన్నదే. ఒకే హీరోకు ఇద్దరు, ముగ్గురితో లవ్ ఎఫైర్స్ లేదంటే డ్యుయల్, ట్రిపుల్ రోల్స్ పోషిస్తే ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ మాత్రం మరో ఫీట్ సాధించబోతున్నాడు.

ఇది ఇప్పటి వరకూ ఏ హీరోకు సాధ్యం కాని ఫీట్. అతడు నటిస్తున్న రావణాసుర మూవీలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అనూ ఎమ్మాన్యుయెల్ తోపాటు దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నడ, మేఘా ఆకాశ్ లు ఈ మూవీలో రవితేజతో నటిస్తున్నారు. ఈ ఐదుగురిలో నలుగురు హీరోయిన్లతో కలిసి రవితేజ ఈ సినిమాలో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు అనే మరో సినిమా షూటింగ్ కూడా అతడు మొదలుపెట్టనున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీలో ఇద్దరు హీరోయిన్లు రవితేజతో నటించబోతున్నాడు. కొత్త హీరోయిన్లు అయిన గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్ మాస్ మహారాజ పక్కన నటిస్తున్నారు. ఈ ఇద్దరితోనూ ఆ మూవీలో రవితేజ పాటలు పాడనున్నాడు.

దీంతో రెండు సినిమాల్లో కలిపి ఆరుగురు వేర్వేరు హీరోయిన్లతో అతడు డ్యాన్స్ చేస్తుంటే చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కనుంది. నిజానికి ఇది చాలా అరుదుగా కనిపించే సీన్. రవితేజ అనే కాదు.. రాబోయే పెద్ద సినిమాలైన ఎస్ఎస్ఎంబీ28, ఎన్టీఆర్30, ఆర్సీ15లలోనూ మహేష్, తారక్, రామ్ చరణ్ ఇద్దరేసి హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు.

IPL_Entry_Point

టాపిక్